రజని పాలిటిక్స్ కి జ్యోతిష్కుడి అడ్డుపుల్ల?
రజని రాజకీయ రంగప్రవేశం ఖాయమని తమిళనాడు భావిస్తోంది. కాకుంటే ముహూర్తం ఎప్పుడన్నదానిపైనే చర్చ సాగుతోంది. ఆగష్టు లేదా అక్టోబర్ లో రజని కొత్త పార్టీ గురించి ప్రకటన చేస్తాడని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఓ పిడుగు లాంటి విషయం బయటికి వచ్చి వారితో పాటు రజని ని కలవరపెడుతోంది. అదేంటో చూద్దాం.
సూపర్ స్టార్ రజనికాంత్ దైవభక్తి గురించి అందరికీ తెలిసిందే. ఆయన సినిమా సినిమాకి మధ్యలో హిమాలయాలకు వెళ్లి రావడం అందరికీ తెలుసు. అక్కడ మహావతార్ బాబా నివాసం వున్నాడని భావించే ఓ గుహలో ధ్యానం చేస్తాడని కూడా కొందరికి తెలుసు. పెద్దగా అందం, చదువు, క్రమశిక్షణ ఇవేమీ లేకుండానే తాను సినిమాల్లో రాణించడం రజనికి కూడా ఆశ్చర్యం కలిగిస్తుందట. ఒక టైం లో మద్యపానం,ధూమపానం వంటి వాటితో గతి తప్పి మళ్లీ వాటికి దూరమై సూపర్ స్టార్ గా ఎదగడం కూడా రజనికి షాకింగ్ గా అనిపిస్తుందట. ఇలా అర్హతకు మించి వచ్చినదంతా దైవబలం ,విధి లిఖితం వల్లనే అని రజని బలంగా నమ్ముతారట.
తాజాగా అల్లుడు ధనుష్ తో పాటు కుటుంబసభ్యులు అంతా రాజకీయాల్లోకి వెళ్ళమని రజని కి చెప్పడం, తమిళనాట పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండటంతో ఆయన పాలిటిక్స్ లో ఎంట్రీ ఇవ్వడానికే రెడీ అయిపోయారు. ఇంతలో ఎందుకైనా మంచిదని రాజకీయాల్లో తానూ రాణిస్తానా, లేదా అని బాగా పేరుమోసిన నలుగురు జ్యోతిష్కుల్ని సంప్రదించారట రజని. అందులో ముగ్గురు రజనికి రాజయోగం ఉందని రాజకీయాల్లో రాణిస్తాడని చెప్పారట. ఒక్క జ్యోతిష్కుడు మాత్రం రాజకీయాల్లోకి వెళితే వున్న పేరుప్రతిష్టలు పోవడం మినహా సాధించేదేమీ లేదని అన్నారట.ఈ మాటని పట్టుకుని రజని పునరాలోచనలో పడతారేమోనని ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారట.