తైవాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఆసుస్ జెన్‌ఫోన్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. భారత మార్కెట్లోకి జెన్‌ఫోన్ 5జెడ్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టినట్లు ఆసుస్ పేర్కొంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 29,999 ఉంటుందని కంపెనీ ప్రకటించింది.
ఫోన్ ఫీచర్లు
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ఎస్వోసీ,
8జీబీ ర్యామ్,
19:9 డిస్ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా,
6.2అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే,
ఆండ్రాయిడ్ ఓరియో 8.0, మైక్రో ఎస్డీ కార్డు,
12+8 మెగాపిక్సెల్ వెనుక కెమెరా,
8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా,
4జీ వీవోఎల్టీఈ సపోర్ట్,
టైప్ సీ పోర్ట్, క్విక్ ఛార్జింగ్ 3.0 సపోర్ట్, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
జూలై 9వ తేదీ నుంచి ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆసుస్ జెన్‌ఫోన్ 5జెడ్ కొనుగోలు చేయవచ్చని సంస్థ ప్రకటించింది. ఇండియా మార్కెట్లో ఈ ఫోన్‌ను మూడు వేరియంట్లలో విడుదల చేసినట్లు కంపెనీ తెలిపింది. 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ గల ఫోన్ ధర రూ. 29,999, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ గల ఫోన్ రూ. 32,999, 8జీబీ ర్యామ్, 256జీబీ అంతర్గత స్టోరేజ్ గల ఫోన్ రూ. 36,999గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది.