అనుకుంటాం కానీ ఆ నాయకుడొచ్చి మనకు చేసిందేమి లేదు…ఈ నాయకుడైనా వచ్చి ఏదైనా మంచి చేస్తాడేమో అని ఆశపడి ఓట్లు వేసిన ప్రతిసారి గర్వభంగం కలిగి, ఆ తరువాత ఈ నాయకుల వాళ్ళ మనకు వచ్చేది, ఒరిగేది ఏమి లేదులే అని సర్దుకుపోయి, బ్రతుకుబండి లాగించే సామాన్యప్రజలకు కొదవేలేదు. కానీ, చూస్తుంటే ఈసారి వచ్చే ఎన్నికల్లో ఓటర్లు తమ ప్రతాపం చూపించేలాగానే ఉన్నారు. ఇప్పటికే తమకి ఇసుమంతైనా సహకారం ఏమి చేయకుండా, ఓట్లు అడుక్కోవడానికి వచ్చిన నాయకులకి ముచ్చెమటలు పోయివిషయానికి వస్తే, 2014 ఎన్నికల్లో తెరాస ప్రభంజనం లో అవలీలగా గెలిచిన అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే టి . వెంకటేశ్వర రావు ఈసారి కూడా నన్ను గెలిపించి,మీ అభివృద్ధిలో పాలు పంచుకోనివ్వండి అంటూ ప్రచారానికి సిద్ధమయ్యారు.
ఇక అంతే, ఆయన అశ్వారావు పేటలో అడుగుపెట్టడం ఆలస్యం, తనని కడిగి పారెయ్యడానికి ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాం అన్నట్టుగా ప్రజలందరూ మూకుమ్మడిగా తిరగబడి, తిరిగి పంపించి వేశారు. అప్పటికీ లేనిపోని గాంభీర్యం ప్రదర్శిస్తూ ఎందుకు ఓట్లు వేయరమ్మా అని అడిగిన ఆయన ప్రశ్నకి, తమరేమి చేసారో చెప్పండయ్యా మళ్లీ ఓటేస్తాము అన్న ప్రజల మాటలకు మరో మారు విస్తుపోతూ ఆ మాజీ ఎమ్మెల్యే “డబల్ బెడ్ రూమ్ ఇల్లులు కట్టించినాము కదమ్మా” అని చెప్తే, ఈసారి విస్తుపోవడం ఆ సమాధానం విన్న ప్రజల వంతు అయ్యింది. అంతలోనే తేరుకొని “అవునా అయ్యా, మాకైతే ఎవరూ ఏ బెడ్ రూమ్ ఇల్లులు కట్టివ్వలేదు. మీరేమైనా కట్టించి ఉంటే, వెళ్లి వాళ్లనే ఓట్లు అడుక్కోండి” అని తెగేసి సమాధానం చెప్పి, అటునుండి అటే అతన్ని తిరిగిపంపించి వేశారు. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, ఇంకెన్నాళ్ళు ప్రజల్ని మభ్యపెడతారో ఈ నాయకులు అని ఇప్పటికి అనుకున్నా , వచ్చేవాడు మభ్యపెట్టడనే గారంటీ ఎవరు ఇవ్వగలరండీ.