రోడ్డుపై అమ్మాయితో వెళ్తుంటే.. కొట్టి చంపేశారు…

పంజాబ్ లో ఘోరం జరిగింది. భార్యతో కలిసి ఓ వ్యక్తి రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే.. అదే సమయంలో అతడిని అడ్డగించిన ఇద్దరు వ్యక్తులు అమ్మాయితో ఇంత రాత్రి పూట ఎక్కడికెళ్తున్నావంటూ కొట్టి చంపేశారు. ఈ ఘటన పంజాబ్‌లోని పటియాలలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

అదేవిధంగా బీహార్‌కు చెందిన మిథున్‌ పాటేల్‌ అనే వ్యక్తి ఉపాధి కోసం పంజాబ్‌లోని పటియాలకు వచ్చి అక్కడి ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. అర్ధరాత్రి సమయంలో తన భార్యతో కలిసి గురుద్వారా దుఖ్‌ నివారణ్‌ సాహిబ్‌కు వెళ్తున్నాడు. అయితే ఆ జంటను అడ్డగించిన జగ్‌మోహన్‌ సింగ్‌, భూపేందర్‌ సింగ్‌ అనే ఇద్దరు వ్యక్తులు.. అమ్మాయితో అర్ధరాత్రి ఎందుకు వెళ్తున్నావంటూ మిథున్‌తో గొడవ పెట్టుకున్నారు. ఆమె తన భార్యేనని.. తామిద్దరం కలిసి గురుద్వారాకు వెళుతున్నామని చెప్పినప్పటికీ వారు దారుణంగా వ్యవహరించ సాగారు. రాళ్లతో, ఇటుకలతో దాడి చేసి ఆ వ్యక్తిని చంపేశారు. కాగా ఈ ఘటనలో పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.