లాహోర్ ను ఎలా వదిలేశారు.? నాడు పంజాబ్ ను ఎలా విడదీశారు.?

How did you leave Lahore? How was Punjab divided?
How did you leave Lahore? How was Punjab divided?

ఇప్పటి పాకిస్తాన్‌ ఒకప్పుడు భారత్‌లో భాగమే. దేశంలో నెలకొన్న పరిస్థితుల వల్ల నాడు పాకిస్తాన్‌ ప్రత్యేక దేశమైంది. ఈక్రమంలో లాహోర్‌ పాక్‌ లో ప్రధాన నగరంగా పేరుపొందింది. అయితే పంజాబ్‌ ఒకప్పుడు పాక్‌లో భాగంగా ఉండేది. విభజన సమయంలో అనేక మార్పులకు చేర్పులకు గుర యింది. చివరకు రెండు ముక్కలయింది. పశ్చిమ పంజాబ్‌ పాకిస్తాన్‌కు మరలిపోయింది. దక్షిణ పంబాబ్‌ భారత్‌లో భాగమైంది. విభజనకు ముందు, పంజాబ్‌ బ్రిటిష్‌ వలస పాలనలో ఒక ప్రావిన్స్‌. ఈ ప్రాంతంలో ముస్లింలు, హిందువులు, సిక్కు మతస్తులు ఎక్కువగా ఉండేవారు. వీరిలో ముస్లింలు తమ ప్రత్యేక దేశం కోసం డిమాండ్‌ చేయడం ప్రారంభించారు. చివరికి అది పాకిస్తాన్‌ ఆవిర్భావానికి దారి తీసింది. ఇది 20వ శతాబ్దం ప్రారంభంలో ఊపందుకుంది.

ఆల్‌ జిన్నా నేతృత్వంలోని భారతీయ ముస్లిం లీగ్‌, ముస్లిం గుర్తింపు కోసం పోరాడింది. సుమారు ఆరు నెలల పాటు ఉద్యమాలు జరిగాయి. ఫలితంగా 10 మిలియన్ల మంది పశ్చిమ పంజాబ్‌కు తరలివెళ్లారు. వీరిలో 5.5 మిలియన్ల మంది ముస్లింలు ఉన్నారు. ఇక హిందువులు, సిక్కులు, తూర్పు పంజాబ్‌కు మకాం మార్చారు. మతపరమైన ఉద్రిక్తతలు, రాజకీయ చర్చలు,రెండు దేశాల సిద్ధాంతం,సరిహద్దు కమిషన్‌, ఆస్తుల విభజన, మత హింస, సాంస్కృతిక సామాజిక మార్పులు విభజనకు దోహదం చేశాయి. బ్రిటీష్‌ వారు భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వడానికి బ్రిటీష్‌ వారు సిద్ధమైనప్పుడు ఈ ప్రాంతం భవిష్యత్‌ నిర్ణయించేందుకు వివిధ రాజకీయ పార్టీల మధ్య చర్చలు జరిగాయి. విభజన సమయంలో పంజాబ్‌లో చెలరేగిన మత హింస చెలరేగింది. ముస్లిం, సిక్కు, హిందువుల మధ్య దాడులు జరిగాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

మత హింస నిరోధానికి ప్రత్యేక దేశం ఏర్పాటు అనివార్యమైంది. భారత్‌, పాక్‌ మధ్య సరిహద్దులను గుర్తించేందుకు జూన్‌ 1947లో బ్రిటిష్‌ ప్రభుత్వం రాడ్‌ క్లిఫ్‌ కమిషన్‌ను నియమించింది. మతపరమైన జనాభా, ఆర్థిక సాధ్యత, భౌగోళిక పరిశీలనల ఆధారంగా సరిహద్దులను నిర్ణయించే అఽధికారం రాడ్‌ క్లిఫ్‌ కమిషన్‌ కు కట్టబెట్టింది. పంజాబ్‌ విభజన ఫలితంగా లక్షలాది మంది ప్రజలు వలస వెళ్లారు. పాక్‌ నుంచి సిక్కులు ,హిందువులు భారత్‌కు,ముస్లింలు భారత్‌ నుంచి పాక్‌కు వలస వెళ్లారు. విభజన సమయంలో మౌలిక సదుపాయాలు, వనరులు,భూమి ఇతర ఆస్తుల పంపకం కూడా జరిగింది. ఆస్తి యాజమాన్య హక్కులు కొత్త వివాదానికి కారణమయ్యాయి. 4 నుంచి 17 మిలియన్ల మంది ప్రజలు విభజన వల్ల తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. జీవనోపాధిని కూడా కోల్పోయారు.

విభజన పంజాబ్‌లో గణనీయమైన సాంస్కృతిక, సామాజిక మార్పులకు కారణమైంది. బ్రిటీష్‌ ఇండియా సైనిక నియామకాలకు పంజాబ్‌ కీలక ప్రదేశం. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు భారత సైన్యంలో 48శాతం పంజాబీ సైనికులు ఉండేవారు. విభజన సమయంలో వీరు తుపాకీలతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు.దీనికి కారణంమై అపారమైన ప్రాణ నష్టం సంభవించింది.పంజాబ్‌ విభజన 1947లో జరిగిన నేటికీ ఈ దేశం మీద ప్రభావం చూపిస్తూనే ఉంది.