జీఎస్టీ : ఊరించి ఉసూరుమనిపించిన వర్మ

audience-comments-on-RGV-Ov
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఏకంగా నెల రోజులుగా ‘గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ అంటూ ఒక పోర్న్‌ షార్ట్‌ ఫిల్మ్‌ గురించి చెబుతూ వస్తున్నాడు. ఆ చిత్రం షూటింగ్‌ కోసం యూరప్‌ వెళ్లాను అంటూ చెప్పిన వర్మ ట్రైలర్‌ మరియు పోస్టర్స్‌ విడుదల చేసిన తర్వాత అందరిలో కూడా అదే చర్చ జరిగింది. సెక్స్‌ విషయంలో ఆడవారికి జరుగుతున్న అన్యాయం గురించి తాను షార్ట్‌ఫిల్మ్‌లో చూపించబోతున్నట్లుగా వర్మ చెప్పుకొచ్చాడు. టీవీ ఛానెల్స్‌లో చర్చ కార్యక్రమాలు, సోషల్‌ మీడియాలో ఆ సినిమా గురించి ట్రెండ్‌ అవ్వడం ఇలా పలు రకాలుగా సినిమాకు భారీ పబ్లిసిటీ దక్కింది. దాంతో సినిమాలో ఏం ఉందా అని అంతా ఎంతో ఆసక్తిగా చూశారు. 26వ తారీకున సినిమాను ఆన్‌లైన్‌ ద్వారా వర్మ విడుదల చేయడం జరిగింది.

పూర్తిగా పోర్న్‌ సినిమా తరహాగా ఉంటుందని ముందే చెప్పిన వర్మ ఈ చిత్రాన్ని చూడాలి అంటే 150 రూపాయలు చెల్లించాల్సిందిగా కండీషన్‌ పెట్టాడు. సరే వర్మ ఏ రేంజ్‌ క్రియేటివిటీని ఉపయోగించి పోర్న్‌ సినిమా తీశాడో చూద్దాం అని వేలాది మంది ఖర్చు చేసి మరీ చూశారు. తీరా ఆ పోర్న్‌ షార్ట్‌ ఫిల్మ్‌ చూసిన తర్వాత ప్రేక్షకులు నోరెళ్ల బెట్టారు. వర్మ మరీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడని అనుకోలేదు అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోర్న్‌స్టార్‌ మియా న్యూడ్‌గా ఇంటర్వ్యూ ఇచ్చినట్లుగా ఉందని, ఆమె తన బాడీతో ఎక్సర్‌సైజ్‌లు చేసినట్లుగా ఉంది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వర్మ చేసిన ఈ ప్రయత్నం అట్టర్‌ ఫ్లాప్‌ అని, మరేదో ఊహించుకుంటే ఇలా ఉందేంటి అంటూ పెదవి విరుస్తున్నారు. ఈ మద్య వర్మ ఏ ఒక్క సినిమా ద్వారా కూడా అంచనాలను అందుకోలేక పోయాడు. చివరకు పోర్న్‌ సినిమాపై పెట్టుకున్న అంచనాలను కూడా నిజం చేయలేక పోయాడు.