Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అక్కినేని ప్రిన్స్ అఖిల్ హీరోగా నటించిన రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డ విషయం తెల్సిందే. భారీ స్థాయిలో అంచనాల నడుమ రూపొందిన ‘అఖిల్’ మరియు ‘హలో’ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ‘హలో’ కాస్త పర్వాలేదు అనిపించడంతో అఖిల్ తన మూడవ చిత్రాన్ని వెంటనే మొదలు పెట్టాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. డిసెంబర్లో ఒకానొక సందర్బంగా మీడియాతో మాట్లాడిన అఖిల్ తన మూడవ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, జనవరి 10 తేదీ తర్వాత ఆ చిత్రం గురించి పూర్తి వివరాలను వెళ్లడి చేసి, ఆ వెంటనే షూటింగ్ కూడా మొదలు పెట్టబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
‘హలో’ సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు అఖిల్ మూడవ సినిమా ఏదర్శకుడి దర్శకత్వంలో అనే విషయంపై క్లారిటీ రాలేదు. పలువురు దర్శకుల పేర్లు వినిపించాయి. కొరటాల శివ దర్శకత్వంలో అంటూ కొన్ని సార్లు, కొత్త దర్శకుడు అఖిల్ మూడవ సినిమాకు దర్శకత్వం వహిస్తాడని కొన్ని సార్లు, హీరో ఆది సోదరుడు సత్య దర్శకత్వంలో అఖిల్ సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. జనవరి 10 తర్వాత ప్రకటన చేస్తానంటూ చెప్పుకొచ్చిన అఖిల్ ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదు. మూడవ సినిమా విషయంలో కూడా అతి జాగ్రత్తను తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. సినిమాల విషయంలో జాగ్రత్తలు పర్వాలేదు కాని అతి జాగ్రత్తలు తీసుకున్న సినిమాలు ఎక్కువ శాతం ఫ్లాప్ అయిన దాఖలాలు కనిపిస్తున్నాయి. అఖిల్ ఇకనైనా తన మూడవ సినిమాను ప్రకటించాలని కోరుకుందాం.