Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భరత్ అను నేను చిత్రంలో మహేశ్ బాబు ముఖ్యమంత్రిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. సీఎంగా మహేష్ బాబు ఎలా ఉంటారో చూడాలని ఆయన అభిమానులు ఎన్నాళ్లనుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ఫస్ట్ ఓత్ ను, ఫస్ట్ అఫీషియల్ పోస్టర్ ను టైటిల్ తో సహా విడుదలచేసింది.
మహేష్ బాబు ప్రమాణ స్వీకార ఆడియో యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. భరత్ అను నేను… శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను, శ్రద్ధతో, శుద్ధితో నిర్వహిస్తానని, భయంగా కానీ, పక్షపాతంగా కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని, దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని మహేష్ బాబు చెబుతున్న డైలాగ్ ట్రెండింగ్ గా మారింది.
ఫస్ట్ లుక్ అనంతరం చిత్ర యూనిట్ భరత్ అను టైటిల్ తో ఫస్ట్ అఫీషియల్ పోస్టర్ విడుదల చేసింది. వెనకవైపు మహాత్మాగాంధీ, బీ.ఆర్. అంబేద్కర్ చిత్రాలు ఉండగా..చేతిలో బ్యాగ్ పట్టుకుని స్టయిల్ గా నడుచుకుంటూ తన కార్యాలయంలోకి వస్తున్నట్టుగా మహేష్ బాబు ఉన్న పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పై దానయ్య నిర్మిస్తున్న భరత్ అను నేనుకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. మహేశ్ కు జోడీగా బాలీవుడ్ నటి కైరా అద్వానీ నటిస్తోంది.