Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మొన్నటిదాకా వినాయక ఉత్సవాలు దేశమంతా ఘనంగా జరుపుకున్నాం. భక్త జన సందోహం మధ్య ఘనంగా నిమజ్జనం చేసుకున్నాం. ..ఇంకా ఆ సందడిలోనుంచి బయటకు రాకముందే ఓ ఆస్ట్రేలియా కంపెనీ భారతీయ భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఓ ప్రకటన రూపొందించింది. ఆస్ట్రేలియాకు చెందిన మీట్ అండ్ లైవ్ స్టాక్ కంపెనీ వినాయక స్వామి మాంసం తింటున్నట్టు ఓ ప్రకటన ప్రసారం చేస్తోంది. ఏసు క్రీస్తు, గ్రీకు దేవతలు, బుద్ధుడుతో కలిసి వినాయకుడు మాంసం తింటున్నట్టు ఆ ప్రకటనలో ఉంది. దీనిపై భారత ప్రభుత్వం అసహనం వ్యక్తంచేసింది.
అంతటితో ఆగకుండా ఆస్ట్రేలియా కోర్టులో ద్వైపాక్షిక విషయాలకు సంబంధించిన వివాదాల కింద కేసు వేసింది. కాన్ బెర్రాలోని భారత హై కమిషన్ ఈ పిటిషన్ దాఖలు చేసిందని భారత ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈ ప్రకటన వల్ల భారతీయుల మనోభావాలు దెబ్బతిన్నాయని హై కమిషన్ పిటిషన్ లో ఆరోపించింది. ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మీడ్ అండ్ లైవ్ స్టాక్ కంపెనీకి సిడ్నీలోని భారత కాన్సులేట్ జనరల్ నోటీసులు కూడా జారీ చేసింది. అటు ఆస్ట్రేలియాలో ఉండే భారత కమ్యూనిటీ సంఘాలు కూడా గణనాథుడు మాంసం తింటున్నట్టుగా ఉన్న ప్రకటనకు వ్యతిరేకంగా ఉద్యమించాయి. వీలైనంత త్వరగా ప్రకటన ప్రసారాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశాయి. భారతీయుల దేవుళ్లను పాశ్చాత్యులు ఇలా తమకు ఇష్టమొచ్చిన రీతిలో చిత్రీకరించటం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పాశ్చాత్య దేశాలు హిందూ దేవుళ్లను అవమానించాయి. కానీ అప్పటి ప్రభుత్వాల్లా ఇప్పటి బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోకుండా ఆ కంపెనీకి గట్టి వార్నింగ్ ఇచ్చింది.
మరిన్ని వార్తలు: