Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం పార్టీ చేపట్టిన సైకిల్ యాత్రలో ఇటీవలి కాలంలో అపశ్రుతులు చోటుచేసుకోవడం షరా మామూలు అయిపొయింది. తాజాగా రాష్ట్ర రహదారులు, భవనాల శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ ద్విచక్ర వాహనం నడుపుతూ ప్రమాదానికి గురయ్యారని తెలుస్తుంది. నిన్న మాకవరపాలెం మండలం మల్లవరం, గిడుతూరు గ్రామాల్లో విజయ్ కార్యకర్తలతో కలిసి సైకిల్ యాత్రలో పాల్గొన్నారు.
యాత్ర పూర్తయ్యాక అక్కడి నుంచి కూతవేటు దూరంలో వున్న పీపీ అగ్రహారం గ్రామం వెళ్లేందుకు బుల్లెట్‌పై బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో మలుపు వద్ద బండి అదుపుతప్పడం వల్ల విజయ్ సహా బుల్లెట్ కింద పడిపోయింది. దీంతో విజయ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ను హుటాహుటిన నర్సీపట్నం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు పరీక్షలు నిర్వహించి ఎడమ చెయ్యి మడం వద్ద విరగడంతో కట్టువేశారు. ప్రస్తుతం విజయ్ విశ్రాంతి తీసుకుంటున్నట్టు సమాచారం.