Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Baahubali 2 Completes 50 days In How Many Theaters
కొన్ని సంవత్సరాల క్రితం సినిమా సక్సెస్ను థియేటర్ల రూపంలో లెక్కించే వారు. అంటే 50 రోజులు ఎన్ని థియేటర్లలో, 100 రోజులు ఎన్ని థియేటర్లలో ఆడిన దాన్ని బట్టి సినిమాల విజయాలను అంచనా వేసేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎంత పెద్ద స్టార్ హీరోల సినిమాలు అయినా రెండు మూడు వారాల కంటే ఎక్కువ రోజులు ఆడే పరిస్థితి లేదు. ఎక్కువ థియేటర్లలో సినిమాను విడుదల చేసి రెండు వారాల్లోనే మొత్తం కలెక్షన్స్ను పిండేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఒక సినిమా 50 రోజులు 100కు పైగా థియేటర్లలో పూర్తి చేసుకుంది అంటే సంచలనమే అని చెప్పవచ్చు.
‘బాహుబలి 2’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 250 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇక దేశంలో ఇతర రాష్ట్రాలతో కలిపితే మొత్తం 600 థియేటర్లలో ఇంకా ప్రదర్శింపబడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఈ స్థాయిలో ఇంత భారీ స్థాయిలో థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్నది లేదు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1650 కోట్లను వసూళ్లు చేసిన ‘బాహుబలి 2’ చిత్రం వచ్చే నెలలో చైనాలో విడుదల కాబోతున్నట్లుగా తెలుస్తోంది.
మరిన్ని వార్తలు:
ఆ సినిమా ప్రధాని పదవిని అవమానపర్చడం కోసమే..!