Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దాదాపు మూడు దశాబ్దాల క్రితం తెలుగులో విడుదలైన ‘బావ బామర్ధి’ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో అప్పటి తరం ప్రేక్షకులకు తెల్సిందే. కృష్ణం రాజు, సుమన్, మాలశ్రీ, జయసుధ, సిల్క్ స్మిత ముఖ్య పాత్రల్లో నటించిన ఆ సినిమా అంత భారీ విజయాన్ని సొంతం చేసుకోవానికి ఒక కారణం అందులో ఉన్న బావలు సైయ్యా… అనే ఐటెం సాంగ్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికి కూడా ఆ పాట కొన్ని వేడుకల్లో ఇంకా వినిపిస్తూనే ఉంది. ఆ పాట ఎంత ఫేమస్ అయ్యిందో చెప్పనక్కర్లేదు. ఆ పాటను పాడిన రాధిక నేడు చెన్నైలో తుది శ్వాస విడిచారు.
తిరుపతికి చెందిన రాధిక తెలుగు, తమిళం మరియు కన్నడంలో పలు పాటలు పాడారు. విభిన్నమైన గొంతు అవ్వడంతో ఆమెను కొన్ని ప్రత్యేకమైన పాటు పాడివ్వాలని దర్శకులు పట్టుబట్టేవారు. 47 ఏళ్ల రాధిక 2004వ సంవత్సరం నుండి పాటలకు దూరంగా ఉంటున్నారు. పెళ్లి చేసుకున్న రాధిక చెన్నైలో కుటుంబ సభ్యులతో జీవితాన్ని గడుపుతున్నారు. ఇటీవల రాధిక గురించి ఎలాంటి వార్తలు రాలేదు. ఉన్నట్లుండి ఆమె చనిపోయారు అంటూ వార్తలు రావడంతో తెలుగు సినిమా పరిశ్రమ వారు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. రాధిక మృతి పట్ల తెలుగు మరియు తమిళ సినీ వర్గాల వారు తమ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.