హరికృష్ణ ఆకస్మిక మరణంతో నందమూరి ఫ్యామిలీ అంతా ఒక్కటైనట్లే కనిపిస్తోంది. ఇంతకు ముందు వరకు కాస్త ఎడమొహం పెడమొహంగా ఉన్న కుటుంబ సభ్యులంతా విషాద సమయంలో ఏకతాటి మీదకు వచ్చారు. కష్టకాలంలో ఒకరికి మరొకరు తోడుగా నిలుస్తున్నారు. హరికృష్ణను కడసారి సాగనంపే సమయంలో చంద్రబాబు పాడె మోసి బావమరిది మీద ప్రేమను చాటారు. ఇప్పుడు బాలయ్య కూడా తన అన్న కొడుకులను ఆత్మీయంగా పలకరించి మేమంతా ఒక్కటే అనే సందేశం పంపారు.
భోజనాలు చేస్తున్న కళ్యాణ్ రామ్, తారక్ దగ్గరకు వెళ్లిన బాలకృష్ణ వారిని ఆప్యాయంగా పలకరించారు. బాబాయి మాట్లాడుతుండగా అబ్బాయిలిద్దరూ శ్రద్ధగా వినడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే మేము చూడలనుకున్నది ఇదే నని కాకపోతే ఇలా ఈ సమయంలో చూడాల్సి రావడమే బాధ కలిగిస్తోందని నందమూరి అభిమానులు బాధ పడుతున్నారు.