Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి బాలకృష్ణకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. స్టార్ హీరోగా గుర్తింపు ఉంది, దైవ భక్తి ఎక్కువగా ఉన్న వ్యక్తిగా బాలయ్యను అంతా భావిస్తారు. కాని పూరితో సహవాసం చేసిన తర్వాత బాలయ్య అంతా మారిపోతున్నాడు. పబ్ కల్చర్‌ను ఎక్కువగా ఫాలో అయ్యే పూరి తాజాగా బాలయ్యను కూడా మెల్లగా పబ్‌లకు మరియు క్లబ్‌లకు అలవాటు చేస్తున్నాడు. ఇంత కాలం చాలా పద్దతిగా, హుందాగా నడుచుకున్న బాలయ్య ఇప్పుడు చెడు మార్గంలో పయనిస్తున్నాడంటూ నందమూరి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం ఏమాత్రం ఫ్యాన్స్‌కు మింగుడు పడటం లేదు. ఈ వయస్సులో బాలయ్య ‘పైసా వసూల్’ వంటి సినిమాను ఎంచుకోవడమే తప్పు. పైగా పూరితో తిరుగుళ్లు ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఇటీవలే హాట్ ఐటెం బాంబ్‌తో డేటింగ్ అంటూ వెళ్లి రచ్చ రచ్చ చేసిన బాలయ్య తాజాగా అర్థ రాత్రి సమయంలో పబ్‌కు వెళ్లాడు. పూరి స్వయంగా తీసుకుని వెళ్లినట్లుగా తెలుస్తోంది. పబ్‌లో మందు తాగి, అమ్మాయిలతో బాలయ్య చిందులు కూడా వేసినట్లుగా చెబుతున్నారు. మొత్తానికి బాలయ్యను కూడా మెల్ల మెల్లగా తన దారిలోకి అదేనండి పబ్‌దారిలోకి నడిపిస్తున్నాడు. ఇండస్ట్రీలో ఉన్న పలువురిని పూరి చెడగొట్టాడని, ఆయనకు చెడు అలవాటు ఉన్నాయని, ఆ అలవాట్లను ఇతరులకు కూడా అంటించాడు అంటూ విమర్శలున్నాయి. తాజాగా ఇప్పుడు వాటిని బాలయ్యకు రుద్దుతున్నాడు. ఇదంతా తాజాగా తాను తెరకెక్కించిన ‘పైసా వసూల్’ చిత్రం కోసం అంటూ పూరి చెబుతున్నప్పటికి ఫ్యాన్స్ మాత్రం ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వార్తలు: