Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Balaya Controversial Comments On Tamil Nativity
నందమూరి బాలకృష్ణ నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని తమిళంలో భారీగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమిళనాట ‘బాహుబలి’ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే తెలుగులో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ని భారీగా విడుదల చేసి అక్కడ కూడా మంచి కలెక్షన్స్‌ను రాబట్టాలని ప్లాన్ చేస్తున్నారు. తాజాగా తమిళ గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. ఆ ఆడియో వేడుకలో బాలయ్య తాను తమిళుడినే, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను అంటూ తమిళంలో మాట్లాడాడు.
సినిమా పబ్లిసిటీ కోసం బాలకృష్ణ ఇలా చీప్‌గా తమిళుడిని అని చెప్పుకోవడంపై సినీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తమిళంలో పుట్టి పెరిగినంత మాత్రాన తమిళుడు ఎలా అవుతాడు అంటూ బాలయ్య వ్యాఖ్యలకు కౌంటర్ వేస్తున్నారు. ఒక వేళ తమిళుడు అయితే తెలుగు రాష్ట్రం అయిన ఏపీలో ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, తెలంగాణలో ఎలా నివాసం ఉంటున్నాడు. ఇంత కాలంగా తెలుగు రాష్ట్రంలో ఉంటు ఇప్పుడు ఒక్క సినిమా కోసం తాను తమిళుడిని అంటూ వాఖ్యలు చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని కొందరు యాంటీ నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు.
మరిన్ని వార్తాలు: