Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాయలసీమ బ్రాండ్ అంబాసిడర్ కు అసలు విషయం తెలిసొచ్చింది. చంద్రబాబు హయాంలో రాయలసీమలో ఎప్పుడూ లేని విధంగా సాగునీరిస్తున్నా.. ప్రతి దానికీ సీఎంను విమర్శించిన రాయలసీమ పరిరక్షణ సమితి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి దిగొచ్చారు. ఏ నోటితో బాబు రాయలసీమకు ద్రోహం చేశారన్నారో.. ఇప్పుడు అదే నోటితో టీడీపీలో చేరడానికి సీఎం అపాయింట్ మెంట్ కోసం పాకులాడుతున్నారు.
ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే, చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణతో భేటీ అయిన బైరెడ్డి.. త్వరలోనే సైకిలెక్కాలని డిసైడయ్యారు. రోజుల వ్యవధిలో అనుచరులతో మీటింగ్ పెట్టుకుని ఆ ఫార్మాలిటీ కూడా పూర్తిచేసుకుంటారట. మరి చంద్రబాబును తిట్టిన నోటితో రేపట్నుంచి ప్రజలకు ఏం సమాధానం చెబుతారంటే.. వారు మాత్రం నాకు ఓట్లేశారా అని దీర్ఘం తీస్తున్నారట.
రాయలసీమ కోసం ఒంటరిగా పోరాడినా. నంద్యాల ఎన్నికల్లో రాయలసీమ పరిరక్షణ సమితి అభ్యర్థికి డిపాజిట్ కాదు కదా.. కనీసం తక్కువలో తక్కువ ఓట్లు కూడా రాలేదని, అలాంటప్పుడు నేనొక్కడ్నే ఎందుకు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని ప్రశ్నిస్తున్నారట బైరెడ్డి. అంటే తెలంగాణ ఉద్యమంతో కేసీఆర్ సీఎం అయిపోయినట్లు.. బైరెడ్డి కూడా రాయలసీమ విడదీసి ముఖ్యమంత్రి కావాలనుకున్నారేమో. తెలంగాణలో ఉన్న ప్రత్యేక రాష్ట్ర భావన.. రాయలసీమలో లేదని స్థానికుడైన బైరెడ్డికి తెలియకపోవడం రాజకీయ అపరిపక్వతే.