Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2015లో . గోరక్షకుల దాడులు మితమీరుతున్నాయని ఏకంగా 114 మంది ఆర్మీ ఆఫీసర్లు ప్రధాని సహా ముఖ్యమంత్రులకు లేఖలు రాయడం సంచలనంగా మారింది. గతంలో కూడా బీఫ్ రగడ సమయంలో.. కవులంతా అవార్డ్ వాపసీ ఉద్యమం చేపట్టారు. ఇప్పుడు ఆర్మీ ఆఫీసర్ల లేఖలు కూడా మోడీకి సంకటంగా మారాయి.
ఇప్పటికే సోషల్ మీడియాలో నాట్ ఇన్ మై నేమ్ ఉద్యమం జోరుగా సాగుతోంది. మోడీ కూడా చాలా బహిరంగ సభల్లో గోవు పేరిట హత్యలు చేయొద్దని, అలాంటి వారిని క్షమించమని హెచ్చరిస్తున్నారు. కానీ రోజురోజుకూ అలాంటి హత్యలు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువగా అలాంటి ఘటనలు జరగడం మోడీని ఇబ్బందిపెడుతోంది.
ఆర్మీ నుంచి ఇలాంటి రియాక్షన్ రావడం మంచిది కాదని భావిస్తున్న మోడీ.. వెంటనే కౌంటర్ ఇవ్వాలని డిసైడయ్యారు. వన్ పెన్షన్ వన్ ర్యాంక్ విధానాన్ని విజయవంతంగా అమలుచేసిన విషయం గుర్తుచేస్తూ.. ప్రతిపక్షాల వలలో పడొద్దని ఆర్మీకి పిలుపు ఇవ్వాలని భావిస్తున్నారట. కానీ ఇతరుల్ని మభ్యపెట్టినంత ఈజీగా ఆర్మీని మభ్యపెట్టలేరనే విషయం మోడీ ఎప్పుడు తెలుసుకుంటారో.
మరిన్ని వార్తలు:
అంబేద్కర్ అల్లూరికి కులమా… పవన్