Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారు వచ్చాక పోలీసులకు అన్ని సౌకర్యాలు కల్పించింది. కొత్త వాహనాలతో ఖాకీలు మెరిసిపోయారు. ఇప్పుడు బెంగాల్ కూడా అదే బాటలో నడుస్తోంది. తమ పోలీసులకు హార్లీ డేవిడ్ సన్ బైకులు సరఫరా చేస్తోంది. ఇప్పటిదాకా సాధారణ బైక్ లు వాడిన పోలీసులు.. ఇకపై రేసుగుర్రాల్లా రోడ్లపై పరుగులు తీయబోతున్నారు.
సాధారణంగా హార్డీ డేవిడ్ సన్ బైకుల్ని రేస్ ల కోసం వాడతారు. మెట్రో నగరాల్లో ధనవంతుల పిల్లలు కూడా స్టేటస్ సింబల్ గా వీటిని ఉపయోగిస్తారు. అలాంటి బైకులు పోలీసులకు ఇవ్వడం చిన్న విషయం కాదు. దీంతో సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన పోలీసులకు కూడా హార్లీ డేవిడ్ సన్ నడపాలన్న కోరిక తీరుతుంది. దీని కోసం దీదీ భారీగా డబ్బు ఖర్చుపెట్టింది.
కోల్ కతా పోలీసుల అవసరాలకు అనుగుణంగా నాలుగున్నర లక్షల రూపాయల ఖర్చుతో హార్లీ డేవిడ్ సన్ స్ట్రీట్ 750 బైకులు తయారయ్యాయి. ఇప్పటికే ఇవన్నీ డెలివరీకి సిద్ధంగా ఉన్నాయి. ఇండిపెండెన్స్ డే వేడుకల్లో కోల్ కతా పోలీసులు ఈ బైకుల మీదే పెట్రోలింగ్ చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే బైకులు రోజువారీ కోసం కాదని, స్పెషల్ అకేషన్స్ కేనని చెబుతోంది బెంగాల్ హోం శాఖ.
మరిన్ని వార్తలు: