Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అనుష్క ‘బాహుబలి’ చిత్రం తర్వాత నటించిన చిత్రం ‘భాగమతి’. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ‘పిల్ల జమీందార్’ ఫేం అశోక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్బంగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అదే స్థాయిలో కలెక్షన్స్‌ను రాబట్టింది. సినిమాకు మొదటి రోజే నెగటివ్ టాక్ వచ్చినా కూడా మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది. రిపబ్లిక్ డే అవ్వడంతో అన్ని షోలు కూడా మంచి ఆక్యుపేషన్ను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా నైజాం ఏరియాలో ‘భాగమతి’కి మంచి ఓపెనింగ్స్ దక్కాయి.
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలిపి 5.5 కోట్ల షేర్‌ను దక్కించుకున్నట్లుగా ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. కేవలం నైజాం ఏరియాలోనే 2.10 కోట్ల షేర్ దక్కింది. ఆంధ్రాలో మంచి వసూళ్లు సాధించిన ‘భాగమతి’ సీడెడ్‌లో మాత్రం కాస్త డల్‌గా సాగింది. సీడెడ్‌లో మొత్తంగా నాలుగు షోలకు కేవలం 75 లక్షల షేర్‌ను మాత్రమే సాధించింది. ఇక ఇతర ఏరియాలైన ఉత్తరాంధ్రలో 70 లక్షలు, గుంటూరు 60 లక్షలు, వెస్ట్ గోదావరి 30 లక్షలు, ఈస్ట్ గోదావరి 40 లక్షలు, కృష్ణలో 38 లక్షలు, నెల్లూరు 27 లక్షల షేర్‌ను దక్కించుకున్నాయి.
రెండవ మరియు మూడవ రోజుల్లో కూడా నైజాం ఏరియాలో మంచి వసూళ్లు ఉండే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఇక ఓవర్సీస్లో కూడా భాగమతికి మంచి ఓపెనింగ్స్ దక్కాయి. వీకెండ్లో కూడా అనుష్క మూవీకి మంచి వసూళ్లు వస్తాయని ఓవర్సీస్ ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి అనుష్క ‘భాగమతి’కి బ్యాడ్ టాక్ వచ్చినా కూడా గుడ్ కలెక్షన్స్ వస్తున్నాయి.