Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అనుష్క ప్రధాన పాత్రలో అశోక్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్లో రూపొందిన ‘భాగమతి’ చిత్రం ఇటీవలే విడుదలైన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొంది, ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడటం జరిగింది. తెలుగుతో పాటు తమిళం మరియు మలయాళంలో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. తెలుగులో అనుష్కపై ఉన్న అభిమానంతో పాటు, సినిమాకు చేసిన పబ్లిసిటీ కారణంగా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ దక్కాయి. ఆ కారణంగా నష్టం కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు. అయితే తమిళం మరియు మలయాళంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
తమిళంలో గ్రీన్ స్టూడియో సంస్థ 10 కోట్లకు రైట్స్‌ను దక్కించుకుంది. అనుష్కకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ కారణంగా సినిమాను భారీ ఎత్తున విడుదల చేశారు. ఎంత ప్రయత్నించినా కూడా ఈ చిత్రం కలెక్షన్స్ 3.5 కోట్లు దాటలేదు. ఇక శాటిలైట్ రైట్స్ ద్వారా 1.5 కోట్లు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా అయిదు కోట్ల వరకు గ్రీన్ స్టూడియో దక్కించుకుంది. మరో అయిదు కోట్ల నష్టంను తమిళ సంస్థ భరించాల్సి వచ్చింది. ఇక మలయాళంలో రైట్స్‌ను దక్కించుకున్న సంస్థ కూడా అదే స్థాయిలో నష్టాన్ని చవి చూడాల్సి వచ్చిందని తెలుస్తోంది. తెలుగులో నిర్మాతకు మరియు డిస్ట్రిబ్యూటర్‌కు భారీ నష్టాలు లేకుండా సేఫ్‌గానే బిజినెస్ అయ్యిందట. ఈ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో అనుష్క చాలా నిరుత్సాహ పడ్డట్లుగా సినీ వర్గాల వారు చెబుతున్నారు. ‘భాగమతి’ సక్సెస్ అయితే మరిన్ని ఆఫర్లు వస్తాయని ఆమె ఆశించింది. కాని ఇప్పుడు ఫలితం తారు మారు అయ్యింది.