భైరవ గీత మూవీ రివ్యూ…!

RGV-bhairava-geetha-movie-review

నటీనటులు : ధ‌నంజ‌య్, ఇర్రా మిర్ర‌ర్
ద‌ర్శ‌కుడు : సిద్ధార్థ్ తాతోలు
నిర్మాత‌: అభిషేక్ నామా, భాస్క‌ర్ ర‌స్సీ
సంగీతం :ర‌వి శంక‌ర్
సినిమాటోగ్ర‌ఫర్ : జ‌గ‌దీష్ చీక‌టి ఎమ్ఎఫ్ఏ
ఎడిటింగ్ :అన్వ‌ర్ అలీ
నిర్మాణ : వ‌ంశ‌ధార క్రియేష‌న్స్

bhiravageetha-movie

ధనంజయ, ఇర్రా మోర్ హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘భైరవగీత’. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే‌తో పాటు నిర్మాణ బాధ్యతల్ని తీసుకున్న వర్మ పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు తెలుగులో డిసెంబర్ 14 విడుదల చేస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 7న కన్నడలో విడుదల కావడంతో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రాబట్టింది. దీంతో సినిమాపై ఉన్న నమ్మకంతో విడుదలకు ఒకరోజు ముందుగానే హైదరాబాద్‌లోని మహేష్ బాబు కొత్తగా కట్టిన ఏఎంబీ సినిమాస్లో ప్రెస్ షో ప్రదర్శించారు. ఇంతకీ ‘భైరవగీత’ సినిమా ఎలా ఉంది? రెస్పాన్స్ ఏంటి? కొత్త దర్శకుడితో వర్మ చేసిన ప్రయోగం ఎంత వరకూ వర్కౌట్ అయ్యింది? తదితర అంశాలు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం..

కధ :

RGV-bhairava-geetha-movieరాయలసీమకు చెందిన భైరవ (ధనుంజయ) కుటుంబం తరతరాలుగా తన ఊరిలో అగ్రవర్ణానికి చెందిన సుబ్బారెడ్డి దగ్గర బానిసలుగా పనిచేస్తుంటారు. ఫ్యాక్షన్ గొడవల్లో సుబ్బారెడ్డిని కాపాడటం కోసం భైరవ తండ్రి మరణిస్తాడు. అప్పటి నుండి తండ్రి వారసత్వంగా వచ్చిన బానిస బతుకుతోటే సుబ్బారెడ్డి ప్రాణాలను కాపాడటం కోసం కత్తి పట్టి నిలబడతాడు భైరవ. అదే ఊరిలో సుబ్బారెడ్డికి కేశవరెడ్డితో ఫ్యాక్షన్ గొడవలు జరుగుతుంటాయి. తనకు ప్రత్యర్థిగా ఉన్న కేశవరెడ్డితో వియ్యం అందుకుంటే తనకు ఊరిలో ఎదురే ఉండదని పట్నంలో చదువుకుంటున్న తన కూతురు గీత (ఇర్రా మోర్)ని కేశవరెడ్డి కొడుకు కట్టారెడ్డి (విజయ్)కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు సుబ్బారెడ్డి.

ram-gopalvarma-movie

ఈ పెళ్లి గీతకు ఇష్టం లేకపోయినా బలవంతంగా కట్టారెడ్డితో నిశ్చితార్ధం జరిపిస్తారు సుబ్బారెడ్డి. అంతకు ముందు శత్రువుల దాడి నుండి తన ప్రాణాలను కాపాడిన భైరవని ఇష్ట పడుతుంది గీత. భైరవకి కూడా గీత అంటే ఇష్టమైనప్పటికీ అంతస్తుల అడ్డుగోడలు అతని ప్రేమకు అడ్డుగా నిలుస్తాయి. క్రూరుడైన కట్టారెడ్డిని పెళ్లి చేసుకోవడం కంటే తన ప్రాణాలను కాపాడిన భైరవతో జీవితం పంచుకోవాలని అనూహ్య నిర్ణయం తీసుకుంటుంది గీత. అయితే గీత భైరవని ఇష్టపడుతుందని తెలుసుకున్న సుబ్బారెడ్డి విశ్వాసంగా పనిచేస్తున్న భైరవని చంపాలని ప్లాన్ చేస్తారు. ఈ విషయాన్ని భైరవతో చెప్పే ప్రయత్నంలో గీత తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. అనంతరం అనుకోని పరిస్థితుల్లో ఆ ఊరి నుండి పారిపోతారు ‘భైరవ-గీత’. అలా పారిపోయిన భైరవ వెనక్కి ఎందుకు వచ్చాడు? వచ్చి ఏమి చేశాడు? పెద్దోళ్ళ అరాచకాలను ఎలా తట్టుకున్నాడు ? గీతను వెనక్కు ఎందుకు తేలేదు ? అనేవి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

kannada-bhiravageetha-movie

కొన్ని సినిమాలు చూస్తున్న‌పుడు వేరే సినిమాలే పదే పదే గుర్తుకు వ‌స్తుంటాయి. ఇప్పుడు భైర‌వ‌గీత సినిమా కూడా అంతే. ఇక్క‌డ కూడా ఈ చిత్రం చూస్తుంటే మ‌రో రెండు మూడు సినిమాలు తెలియ‌కుండానే మైండ్ లోకి వ‌స్తుంటాయి. అందులో ముందుగా క‌ళ్ల ముందు క‌నిపించేది య‌జ్ఞం ఒకటి, రాఘవేంద్ర రావు గంగోత్రి ఒకటి. అయితే గోపీచంద్ హీరోగా ఏఎస్ ర‌వికుమార్ చౌద‌రి తెర‌కెక్కించిన యజ్ఞం 15 ఏళ్ల కింద విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. అగ్ర కులంలో అమ్మాయిని ఓ తక్కువ కులం వాడయిన అనుచరుడే ప్రేమిస్తే అగ్ర కులం వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు.. ఆ త‌ర్వాత హీరో ఏం చేసాడు.. అగ్ర కులాల వాళ్ల‌ను ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఆ క‌థ‌. ఇప్పుడు భైర‌వ‌గీత కూడా అంతే. అదే క‌థ‌ను ముద్దులు పెట్టి ర‌క్త‌పాతం ఎక్కువ‌గా పెట్టి చూపించాడు ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ తాతోలు. ఒకరకంగా తాతోలు మళ్లీ ఇదే తరహా ప్రేమకథకు కొత్తరకం ట్రీట్ మెంట్ ఇచ్చారు. ‘తిరుగుబాటు ఎప్పుడూ కులాల మధ్యన మతాల మధ్యన కాకుండా ఉన్నవాళ్లకు లేనివాళ్లకు మధ్యనే జరిగాయి. దొరల అరాచకాలు భరించలేని స్థాయికి పెరిగినప్పుడు అణచబడ్డ వర్గాలలో విప్లవాలోచనలు పుడతాయి. వాటిని తన ఉక్కుపాదాలతో తొక్కిపారేయడానికి దొరలు మారణ హోమం సృష్టిస్తారు. కాని న్యాయం కోసం మొదలయ్యే ఏ తిరుగుబాటుని ఎవ్వరూ ఆపలేరు. యావత్ ప్రపంచంలో వచ్చిన ప్రతి తిరుగుబాటు వెనుక దాన్ని ప్రేరేపించిన కథ ఒకటి ఉంటుంది. 1991లో నిజంగా జరిగిన ఒక విప్లవం వెనుక ఓ ప్రేమకథ ఉంది. ‘గీత’ అనే అమ్మాయి ‘భైరవ’ అనే అబ్బాయితో ప్రేమలో పడటం మూలాన మొదలైన ఆ చరిత్రే ‘భైరవగీత’. అని సినిమాకి ముందు చెప్పించాడు వర్మ.

Ram Gopal Varma Bhairava Geetha To Release In Four South Languages ,
భయంకరమైన హింస, రక్తపాతం, ఒళ్లుగగుర్పొడిచే భయానక సన్నివేశాలు అంతే రేంజ్ లో రొమాన్స్, లవ్ఇలా వర్మ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా హింసను చూపిస్తూ రక్తాన్ని ఏరులై పారించాడు సిద్దార్థ్ తాతోలు. అయితే అక్కడక్కడా హింస ఓవర్ అనిపించినా కథకు అవి అవసరం అనే అనిపిస్తాయి. ముఖ్యంగా ప్రతినాయకుడు కట్టారెడ్డిని క్రూరంగా చూపించే సన్నివేశం మరీ జుగుప్సాకరంగా ఉంటుంది. ఇక హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్, లిప్ లాక్‌లు ఉన్నప్పటికీ అవి కూడా కథలో భాగంగానే చూపించారు. తనకు ముద్దంటే తెలియదని ప్రెస్ మీట్‌లో చెప్పిన దర్శకుడు. ఆ ముద్దుని ప్రేమ కోసం ఎలా వాడాలో చూపించాడు.కంటెంట్ ఉన్న కథను స్క్రీన్‌పై పర్ఫెక్ట్‌గా ప్రజెంట్ చేయాలంటే పాత్రలకు జీవం పోసే నటీనటులు దొరకాలి. అప్పుడే ఈ కథ పండుతుంది. మొన్న ఆరెక్స్ 100 నేడు ‘భైరవగీత’ రెండూ రెండే. హీరో హీరోయిన్లుగా చేసిన ధనుంజయ, ఇర్రా మోర్‌లు పరిణితి ఉన్న నటనతో చక్కగా మెప్పించారు. ముఖ్యంగా భైరవ పాత్రలో ధనుంజయ ఒదిగిపోయాడు. ఒకరకంగా జీవించాడు. ముఖ్యంగా తన ప్రేమ కోసం బలైన తల్లిని చూసి ఏడ్చే సన్నివేశం థియేటర్‌లో ప్రేక్షకుల కళ్ల వెంబడి నీళ్ళు తెప్పించేలా అద్భుతంగా నటించాడు.

భైరవ గీత మూవీ రివ్యూ...! - Telugu Bulletఇక సెకండాఫ్‌లో తిరుగుబాటు దారుడిగా మారి విలన్ ఇంటికి వెళ్లి ఇచ్చే వార్నింగ్ సీన్ సినిమాకే హైలైట్. ఇక హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయమైన ఇర్రా మోర్‌కి ‘భైరవగీత’ చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది. ఈ కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. గీత పాత్రలో పరిణితి ఉన్న నటనతో ఆకట్టుకుంది. తప్పు చేసినప్పుడు నా, మన అనే భేదం లేకుండా చెంప చెల్లుమనిపించాలని నిశ్చితార్ధం సీన్‌లో ఆమె పాత్ర ద్వారా ఎలివేట్ చేశారు. తన ప్రేమకోసం కత్తి పట్టిన ప్రియుడికి అండగా నిలుస్తూ శత్రువుల్ని తెగనరికేలా పవర్‌ఫుల్‌ పాత్రగా మలిచారు. ఆఖరుకి నరనరాల్లో కులం, ఆస్తి, అంతస్తుల్ని నింపేసుకుని సాటి మనుషులను బానిసలుగా చూసే తండ్రిని సైతం అంతమొందించే వీర వనితగా ఆమె నటన న భూతో న భవిష్యత్. ఇక గ్లామర్ పరంగా లిప్ లాక్ లూ, నావెల్ షోలూ తప్పలేదు అనుకోండి. ఇక మరీ ముఖ్యంగా చెప్పాల్సింది ఇక ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర ప్రతినాయకుడిగా నటించిన కొత్త నటుడు కట్టారెడ్డి (విజయ్).

భైరవ గీత మూవీ రివ్యూ...! - Telugu Bulletఆరున్నర అడుగులు.. భారీ శరీరంతో ఉన్న విజయ్ విలన్‌గా బయపెట్టేశాడు. దర్శకులకు తెలుగులో మరో ప్రతినాయకుడు దొరికినట్టే.రవిశంకర్ మంచి సంగీతాన్ని అందించారు. వందేమాతరం, ఇదో ఇది సాంగ్‌లతో పాటు హీరో తల్లి చనిపోయినప్పుడు వచ్చే సాంగ్ కథలు సినిమాని మరో లెవెల్లో ఉన్నాయి. ఇక నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్లస్. ఛేజింగ్, యాక్షన్, ఎమోషన్స్, పోరాట సన్నివేశాల్లో సందర్భాను సారంగా అదిరిపోయే మ్యూజిక్ అందించారు. ఇక రామ్ వంశీ క్రిష్ణ రాసిన ప్రతి డైలాగ్‌కి థియేటర్స్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రాయలసీమ ఫ్యాక్షన్‌ను విజువల్‌గా ప్రతి ఫ్రేమ్‌లోనూ ఎంతో చక్కగా చూపించగలిగారు సినిమాటోగ్రాఫర్ జగదీష్ చీకటి. సినిమా ప్రారంభంలో వచ్చే ఏరియల్ షార్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. నిర్మాతలు అభిషేక్ నామా, భాస్కర్ రాశి నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగానే ఉన్నాయి.

తెలుగు బుల్లెట్ పంచ్ లైన్ : ‘భైరవగీత’ రొటీన్ స్టోరీ – కొత్త ఎక్సైట్మెంట్
తెలుగు బుల్లెట్ రేటింగ్ : 2.75 / 5