తెలుగు బిగ్‌బాస్ సీజన్ 2కు కౌశల్ ఆర్మీ కారణంగా భారీ పబ్లిసిటీ దక్కిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కౌశల్ ఆర్మీ కారణంగానే తెలుగు బిగ్‌బాస్‌కు ఈస్థాయిలో గుర్తింపు దక్కింది. అయితే ఇప్పుడు అదే కౌశల్ ఆర్మీ కారణంగా బిగ్‌బాస్‌కు చెడ్డ పేరు వస్తుంది. మొదటి సీజన్లో బిగ్‌బాస్ ఏం చేస్తే దాన్ని ప్రేక్షకులు స్వీకరించారు. కాని ఇప్పుడు బిగ్‌బాస్‌లో జరిగిన ప్రతి చిన్న విషయాన్ని కూడా కౌశల్ ఆర్మీ ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కౌశల్ ఆర్మీ ఏదైన పనిని తప్పుపడితే అంతా కూడా దాన్ని తప్పు అంటున్నారు. ఇదే సమయంలో బిగ్‌బాస్ నిర్వాహకులపై కౌశల్ ఆర్మీ తీవ్ర స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నారు. నూతన్ నాయుడు ఎలిమినేషన్‌తో కౌశల్ ఆర్మీ ఇప్పుడు బిగ్‌బాస్ టీంనే టార్గెట్ చేయడం జరిగింది.
ఆమద్య నాని బిగ్‌బాస్ హోస్ట్‌గా అన్ ఫిట్ అంటూ హ్యాష్ ట్యాగ్‌తో జాతీయ స్థాయిలో ట్రెండ్‌ను క్రియేట్ చేశారు. తాజాగా తెలుగు బిగ్‌బాస్‌లో న్యాయం లేదు, నీతి లేదు అంటూ ప్రచారం చేస్తూ జాతీయ స్థాయిలో పరువు తీస్తున్నారు. కౌశల్ ఆర్మీ ఒక హ్యాష్ ట్యాగ్‌తో తెలుగు బిగ్‌బాస్ పరువును జాతీయ స్థాయిలో తీస్తున్నారు. దాంతో బిగ్‌బాస్ నిర్వాహకులు తీవ్రమైన అసంతృప్తికి లోనవుతున్నారు. భారీ ఎత్తున చేస్తున్న విమర్శల కారణంగా బిగ్‌బాస్‌పై సాదారణ ప్రేక్షకులకు కూడా నమ్మకం కోల్పోతున్నారు. మరో మూడు వారాల సీజన్ మిగిలి ఉన్న నేపథ్యంలో క్లైమాక్స్‌లో ఎవరు విజేత అనే విషయమై క్లారిటీ వచ్చేసింది. కౌశల్ ఆర్మీ ఈ రేంజ్లో ఉన్నారు కనుక ఖచ్చితంగా కౌశల్ గెలుస్తాడని స్టార్ మా వర్గాల వారు అంటున్నారు. ఈమద్య కాలంలో కౌశల్ గురించి హైలైట్ అయ్యేలా వీడియోలను చూపించకుండా జాగ్రత్త పడుతున్నారు. మొత్తానికి కౌశల్ ఆర్మీ వల్ల బిగ్‌బాస్ నిర్వాహకులు కూడా విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడినది.