Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Bihar Cm Nithish Against To Upa President Candidet Meera Kumari
దేశ ప్రథమపౌరుడి ఎన్నికలు కూడా రాజకీయాంగా చర్చనీయాంశమౌతున్నాయి. రాజకీయాలకు అతీతమైన వ్యక్తిని నిలబెట్టాలన్న ఇంకితం అధికార, ప్రతిపక్షాలు ఎవరికీ లేకుండా పోయింది. ఎన్డీఏ సంగతి పక్కనపెడితే.. కనీసం యూపీఏ అయినా అందరికీ నచ్చే అభ్యర్థిని ఎంపిక చేస్తుందని భావించినా.. వాళ్లు కూడా లోక్ సభ మాజీ స్పీకర్ ను వెతికి పట్టుకురావడం మేధావులకు నచ్చలేదు.
బాబు జగ్దీవన్ రామ్ కుమార్తె అనే బ్యాక్ గ్రౌండ్ తప్ప మీరాకుమార్ అంత చెప్పుకోదగ్గ పనులు చేయలేదనే అపప్రథ ఉంది. లోక్ సభ స్పీకర్ గా కాడూ ఆమె పని తీరు జస్ట్ యావరేజ్ అంతే. పైగా విభజన బిల్లు సమయంలో వ్యవహరించిన తీరు మాయని మచ్చే. అలాంటి వ్యక్తిని వెతికి తీసుకురావడమేంటో ఎవరికీ అర్థం కావడం లేదు. పైగా ఏకాభిప్రాయం వచ్చిందని చెప్పడం ఇంకా కామెడీగా మారింది.
నితీష్ ను ఇబ్బందిపెట్టడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని చాలా మంది భావిస్తున్నారు. యూపీకి చెందిన కోవింద్ కు మద్దతిచ్చిన నితీష్.. ఇప్పుడు బీహార్ కీ బేటీకి ఎందుకు మద్దతివ్వరో చెప్పుకోవాల్సిన అగత్యం వచ్చింది. కానీ నితీష్ మాత్రం యూపీయే రాజకీయాన్ని లైట్ తీసుకున్నారు. తాను కోవింద్ కే మద్దతిస్తానని మరోసారి స్పష్టం చేశారు. దీంతో మీరా పాచిక నితీష్ దగ్గర పారలేదనే మాట వినిపిస్తోంది.
మరిన్ని వార్తలు
కృష్ణా డెల్టాకి పట్టిసీమ నీళ్లు… ఈ ఏడు 100 టీఎంసీలు ?
ఐవైఆర్ కి వైసీపీ పరీక్ష పెట్టింది.