తెలంగాణలో ఘోరం జరిగింది. బైక్ పై వెళుతున్న ఓ మహిళ తన ముఖానికి కట్టుకున్న మాస్క్, బండి వెనుక చక్రంలో ఇరుక్కుని కింద పడేయటంతో దుర్మరణం పాలైంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ సమీపంలో చోటుచేసుకోవడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు వెల్లడించిన దాని ప్రకారం… విజయవాడ రూరల్ మండల పరిధిలోని పైడూరుపాడుకు చెందిన మాలన్ బీ (45) లాక్ డౌన్ కు ముందు కొత్తగూడెంలో ఉన్న తన అన్నయ్య ఇంటికి వెళ్లింది. ఆపై అక్కడే చిక్కుకుపోయిన ఆమె.. ఇప్పుడు సడలింపులు రావడంతో ఇంటికి తీసుకెళ్లాలని చెప్పింది. దీంతో ఆమె అన్న.. అల్లుడు గపూర్ నందిగామ బయలుదేరాడు. తాను కూడా అక్కడి వరకూ వచ్చి.. ఆ తర్వాత బస్సులో వెళ్తానని చెప్పి బయలుదేరింది.