త్రిపుర ముఖ్య‌మంత్రిగా బిప్ల‌వ్ కుమార్ దేబ్ ప్ర‌మాణస్వీకారం

Biplab Deb-take-Oath-as-Tri

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

త్రిపుర‌లో కొత్త శ‌కం ప్రారంభ‌మైంది. 25 ఏళ్ల క‌మ్యూనిస్టుపాల‌నకు ముగింపు ప‌లికి… కాషాయ‌ద‌ళం అధికార ప‌గ్గాలు స్వీక‌రించింది. త్రిపుర ఎన్నిక‌ల్లో ఘ‌న‌విజ‌యం సాధించిన బీజేపీ కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటుచేసింది. త్రిపుర నూత‌న ముఖ్య‌మంత్రిగా విప్ల‌వ్ దేవ్ కుమార్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాన‌మంత్రి మోడీ హాజ‌ర‌య్యారు. త్రిపుర‌లో అబివృద్ధికి కేంద్రం అండ‌గా ఉంటుంద‌ని ప్ర‌ధాని హామీఇచ్చారు.

త్రిపుర‌ను కొత్త శిఖ‌రాలకు తీసుకెళ్దాం… దాని వ‌ల్ల ప్ర‌జ‌ల జీవితాల‌ను మార్చొచ్చు. రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేసేందుకు కేంద్రం అన్ని విధాలా స‌హ‌కారం అందిస్తుంది. ఈ కొత్త ప్ర‌భుత్వం అభివృద్ధి కోస‌మే ప‌నిచేస్తుంది. స‌బ్ కా సాథ్, స‌బ్ కా వికాస్ నినాద‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం. ప్ర‌ధాని హోదాలో చాలా సార్లు ఈశాన్య రాష్ట్రాల్లో ప‌ర్య‌టించాను. ఈశాన్యంతోనే భార‌త‌దేశం. ఇక్క‌డ స‌మ‌స్య‌ల‌ను యావ‌త్ దేశం అర్థంచేసుకుంది. ఈశాన్య ప్ర‌జ‌ల‌కు యావ‌త్ భారతం తోడుగా నిలుస్తుంది అని మోడీ త‌న ప్ర‌సంగంలో త్రిపుర ప్ర‌జ‌ల‌కు భ‌విష్య‌త్ పై భ‌రోసా క‌ల్పించారు. విప్ల‌వ్ దేవ్ కుమార్ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా, పార్టీ సీనియ‌ర్ నేత‌లు ఎల్. కె.అద్వానీ, ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు హాజ‌ర‌య్యారు.