Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఎవరికి మద్దతివ్వాలి, అసలు పాల్గొనాలా.. వద్దా అని మొన్నటిదాకా ఎంఐఎం నేతలు తర్జనభర్జన పడ్డారు. ప్రతి విషయంలో చాలా క్లారిటీగా ఉండే ఒవైసీలను తెలంగాణ సీఎం కేసీఆర్ అయోమయంలో పడేశారు. ఆయన సడెన్ గా రూటు మార్చి బీజేపీ అభ్యర్థి కోవింద్ కు మద్దతివ్వడంతో.. ఓవైసీ బ్రదర్స్ తర్జనభర్జనపడి చివరకు ఓ స్పష్టతకు వచ్చారట.
బీజేపీ అభ్యర్థికి మద్దతిస్తే బెటరని మొదట ఎంఐఎం నేతలు భావించినా.. సంప్రదాయ సిద్ధాంతాలకు విరుద్ధంగా వెళ్లడం మంచిది కాదని భావించి.. చివరకు కాంగ్రెస్ కే సపోర్ట్ ఇవ్వాలని నిర్ణయించారు. కనీసం రాష్ట్రపతి ఎన్నికల నుంచి దూరంగా ఉండాలని ఎంఐఎం ప్రయత్నించినా.. అది పలాయన మంత్రం పఠించినట్లవుతుందని సీనియర్లు అభిప్రాయపడ్డారట. దీంతో నెగటివ్ ప్రచారం జరుగుతుందని అసద్ భావించారు.
చివరకు ఎన్నికల్లో పాల్గొనాల్సిందేనని, బీజేపీ అభ్యర్థికి మద్దతివ్వలేం కాబట్టి, కాంగ్రెస్ అభ్యర్థి మీరాకుమార్ కు ఓటేయాలని డిసైడయ్యారు. 2014 ఎన్నికల ముందు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాం కాబట్టి.. ఇప్పుడు కూడా అలా చేయొచ్చని ఒవైసీ బ్రదర్స్ నిర్ణయించుకున్నారు. మరోసారి ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదని గతంలో మాదిరిగనా కన్ఫ్యూజన్ లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని డిసైడయ్యారు ఒవైసీలు.
మరిన్ని వార్తలు