Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
16 నియోజకవర్గాలు,ఇరవై వేల ఓట్లు మారిపోతే ప్రధాని మోడీ రాజకీయ జీవితమే మారిపోయేది. గుజరాత్ ఎన్నికల ఫలితాల తర్వాత మోడీ తేలిగ్గా ఊపిరి పీల్చుకుందామనుకున్నా కఠిన వాస్తవాలు కొన్ని ఆయన్ను కుదురుగా ఉండనీయడం లేదు. గుజరాత్ ఫలితాల్ని కాస్త లోతుగా విశ్లేషణ చేస్తే కళ్ళు చెదిరే నిజాలు బయటకు వస్తున్నాయి. కమలనాధులు గెలిచిన 99 నియోజకవర్గాల్లో 16 చోట్ల ఆ పార్టీ మెజారిటీ మూడు వేల లోపే. గోధ్రాలో లో అయితే ఆ పార్టీ అభ్యర్థి గెలిచింది కేవలం 300 లోపు మెజారిటీతో. ఇక్కడ నోటా కి 3 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఇలాంటివి ఇంకో 15 నియోజకవర్గాలు వున్నాయి. అక్కడ బీజేపీ అభ్యర్థులకు ఎంత మెజారిటీ వచ్చిందో మీరే చూడండి.
గోధ్రా – 258
దోల్కా – 327
బోటడ్-906
విజాపుర్ – 1164
హిమత్ నగర్ – 1712
పోరు బందర్ -1855
గరిదార్ – 1876
ఉమారెత్ – 1883
రాజ్ కోట్ రూరల్ – 2179
కంబ్బత్ – 2318
వాగ్ర – 2370 .
మటర్ – 2406
ప్రతిజ్ – 2551
ఫతేపుర – 2711
దభోయ్ – 2839
విసనగర్ – 2869 .
ఈ నియోజకవర్గాల్లో బీజేపీ కి పడ్డ ఓట్లలో 20 వేలు , కాంగ్రెస్ కి పడి ఉంటే గుజరాత్ ఫలితాలే మారిపోయేవి. గోద్రాలో 150 ఓట్లు మారితే ఫలితం మారేది. గెలిచిన తర్వాత కూడా ఆ లెక్కలు చూసుకుంటే బీజేపీ కి విజయానందం మిగలడం లేదు. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న వారిలో కనిపించే కలవరపాటు ఇప్పుడు బీజేపీలో కనిపిస్తోంది. బీహార్ ఎన్నికల్లో ఓడిపోయినా ధైర్యంగా కనిపించిన మోడీ మోహంలో తొలిసారి ఆదుర్దా కనిపిస్తోంది. నిజమే … ఆయన టెన్షన్ పడడంలో అర్ధం వుంది. 20 వేల ఓట్లు అటు ఇటు అయితే ఇప్పుడు మోడీ ఎన్ని ప్రశ్నలకు ఎందరికి జవాబు చెప్పాల్సి వచ్చేదో కదా !