Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హర్యానాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి కుమారుడి తీరు విమర్శలకు తావిస్తోంది. ఓవైపు ప్రధాని విలువలు ప్రబోధిస్తుంటే… ఇక్కడ బీజేపీ నేతల తనయులు మాత్రం ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు. వారు చేసే పాడుపనుల్ని ఆపడం వాళ్ల తండ్రుల వల్ల కూడా కావడం లేదు. సుపరిపాలన కోసం బీజేపీ అధినాయకత్వం తపిస్తుంటే… నేతల తనయులు చేసే పొరపాట్ల కారణంగా పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది.
కాంగ్రె్స్ ముక్త భారత్ సాకారం కావాలంటే బీజేపీ కొత్త రాష్ట్రాల్లో పాగా వేయాలి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాల్లో కూడా అధికారం నిలిచేలా లేదు. కీలకమైన హర్యానాలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి తనయుడు చేసిన నిర్వాకం బీజేపీని తలెత్తుకోకుండా చేసింది. తప్పు చేయడమే కాకుండా… కనీసం విచారణకు కూడా సహకరించని వికాస్ భరాలాను డీల్ చేయడం పోలీసుల వల్ల కావడం లేదు.
ఈ కేసులో న్యాయం జరగకపోతే దాన్నో ఉద్యమంగా లేవదీయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. అదే జరిగితే హిందీ బెల్ట్ లో బీజేపీ ఆశలకు గండిపడినట్లే. అందుకే అమిత్ షా రంగంలోకి దిగారట. అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉండాలని వికాస్ తండ్రి సుభాష్ బరాలాకు తేల్చిచెప్పారట. దీంతో ఆయన గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మరి ఇప్పుడైనా వికాస్ దారికొస్తాడో.. రాడో.
మరిన్ని వార్తలు:
క్విట్ ఇండియా… క్విట్ ఏపీ
బీజేపీకి గట్టి దెబ్బ
అదసలు పెద్ద సమస్యే కాదు