కర్ణాటకలో మళ్లీ ఎన్నికల దిశగా బీజేపీ కుట్ర?

Bjp plans for re elections in karnataka

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కర్ణాటక లో రాజకీయంగా తగిలిన ఎదురు దెబ్బ ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది. ఆ రాష్ట్రంలో జేడీఎస్ , కాంగ్రెస్ కూటమి కొత్త ప్రభుత్వ ఏర్పాట్లు అయినా పూర్తి కాక ముందే కొత్త కుట్రకి బీజేపీ తెరలేపింది. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకి బీజేపీ చేసిన ప్రయత్నాలను నిన్నటి ప్రెస్ మీట్ లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమర్ధించుకున్నారు. పైగా కన్నడ ప్రజల తీర్పు స్పష్టంగా లేనందున మరోసారి ఎన్నికలు జరగాలని అభిప్రాయపడ్డారు. అమిత్ షా నోట కర్ణాటకలో మళ్లీ ఎన్నికలు అన్న మాటని తేలిగ్గా తీసుకున్న వారికి షాక్ తగిలే వార్త ఇది. అమిత్ షా ఏదో యధాలాపంగా మళ్లీ ఎన్నికల అంశాన్ని లేవనెత్తినట్టు కనిపించినా అంతకు మించిన లోతైన వ్యూహం అందులో ఉందన్న విషయం తేటతెల్లం అయ్యింది.

కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని ఓ షెడ్ దగ్గర 8 వీవీ ఫాట్ మెషిన్ బాక్స్ లు బయటపడ్డాయి. అంటే ఏమిటి అనేగా మీ సందేహం?. ఈవీఎం లని తరలించే బాక్స్ లు. అయితే ఇవి ఎన్నికల కమిషన్ వాడేంత నాణ్యంగా లేవు. కావాలని నాసిరకంగా తయారు చేసి బయటపడేసినట్టు వున్నాయి. అయితే ఆ ఖాళీ బాక్సులు సాకుగా చూపి యెడ్యూరప్ప ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. కర్ణాటక ఎన్నికలు సజావుగా జరగలేదని , అక్రమాలపై విచారణ జరపాలని ఆ లేఖ సారాంశం. అయితే కర్ణాటక ఎన్నికల అధికారి సంజీవ్ కుమార్ మాత్రం ఎలాంటి అక్రమాలకూ తావులేదని చెప్పారు. పైగా బయటపడ్డ 8 వీవీ మెషిన్ బాక్స్ లు ఎన్నికల సంఘం వినియోగిస్తున్నవి కాదని, ఎవరో కావాలని నకిలీవి తయారు చేసి అక్కడ పడేశారని వివరణ ఇచ్చారు.

పై రెండు పరిణామాలు చూసాక ఇంత జరిగినా కర్ణాటక ఎపిసోడ్ నుంచి బీజేపీ ఏ పాఠం నేర్చుకోలేదని అర్ధం అవుతోంది. పైగా ఎన్నికల అక్రమాల పేరుతో ఇంకోసారి కర్ణాటకలో చిచ్చు రాజేయడానికి , కొత్త ప్రభుత్వం ఏర్పాటైనా కాకముందే మంట రాజేయడానికి సిద్ధం అవుతోంది. ఈ వ్యవహారం ఇంకాస్త ప్రచారంలోకి వస్తే బీజేపీ పచ్చి మోసాన్ని , వికృత ఆలోచనల్ని ప్రజలు చీదరించుకోవడం ఖాయం.