Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ బీజేపీ నేతలకు ఆవేశం ఎక్కువ. ఏధో అనబోయి.. ఇంకేదో అని ఆ తర్వాత తీరిగ్గా నాలుక కరచుకోవడం రివాజైపోయింది. కొన్నాళ్లుగా తెలంగాణ టీడీపీని చులకనగా చూస్తున్న బీజేపీ నేతలు.. అధిష్ఠానం హితవును కూడా పట్టించుకోవడం లేదు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని పోరాటం చేస్తున్న బీజేపీ నేతలు.. టీఆర్ఎస్ ను, మిత్రపక్షం టీడీపీని ఒకే గాటన కడుతున్నారు.
బీజేపీకి తెలంగాణలో బలం లేదు. వచ్చిన ఐధారు సీట్లు కూడా టీడీపీ ఓటుబ్యాంకు కారణంగా వచ్చినవే. అలాంటి పార్టీకి చెందిన నేతలు.. తమను అంటే ఎందుకు పడాలని తెలంగాణ తమ్ముళ్లు బాబును నిలదీస్తున్నారు. దీంతో ఇఫ్పటికే చంద్రబాబు చాలాసార్లు అమిత్ షా దృష్టికి విమర్శల్ని తీసుకెళ్లారు. అయినా సరే డోంట్ కేర్ అంటున్న తెలంగాణ బీజేపీ నేతలు మరోసారి నోరు జారారు.
గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా విమోచన దినం నిర్వహించలేదని, అధేమంటే సాకులు చెప్పారని, వాళ్లు చెప్పిన కారణాలే ఇప్పుడు కేసీఆర్ చెబుతున్నారని, అన్నీ ఆ తాను ముక్కలేనని మాట్లాడారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. అనవసరంగా ఉన్న ఏకైక మిత్రపక్షంతో కూడా తగవు పెట్టుకుంటే.. వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదని గుర్తుంచుకోవాలని మండిపడుతున్నారు టీడీపీ నేతలు.
మరిన్ని వార్తలు: