Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్నాటక ఎన్నికలు దగ్గరకి వచ్చేశాయి మరో వారం రోజుల్లో ఎన్నికలు తర్వాత మూడో రోజున ఎన్నికలు ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఈవీఎం ట్యాంపరింగ్ అంశం తెర మీదకి వచ్చింది. నిజానికి బీజేపీ అధికారం వచ్చిన నాటి నుండి జరిగిన అన్ని ఎన్నికల్లో బెజేపీ దాదాపు గెలుస్తూనే వచ్చింది. ఎందుకంటే ఆ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను తమకు అనుకూలంగా బీజేపీ మారుస్తుందనే వాదన బలంగా వస్తోంది. గతంలో కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో… మొదటగా పడే కొన్ని ఓట్లు బీజేపీకి పడేలా ప్లాన్ చేశారని ప్రత్యర్ధి పార్టీల వారు ఆరోపణలు గుప్పించారు. ఈవీఎంలను వైఫే తో లింక్ చేసి… ఆన్ లైన్ ద్వారా మ్యానిపులేట్ చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి.
త్రిపుర ఎన్నికల్లో అసలు రేసు లోనే లేదనుకున్న బీజేపీ పార్టీ కౌంటింగ్ లో ఒక్కసారిగా లీడ్ లోకి వచ్చేసరికి అందరికీ సందేహాలు వచ్చాయి. అదీ కాక గుజరాత్ ఎన్నికల్లోనూ భారీగా ఈ ట్యాంపరింగ్ జరిగిందన్న ఆరోపణలని బీజేపీ ఎదుర్కొంది. ఇప్పుడు కర్ణాటకలోను ఇదే జరిగే ప్రమాదం ఉందన్న చర్చ సర్వత్రా సాగుతోంది. త్రిపుర లో లాగా అనుమానం వచ్చేలా అన్ని నియోజకవర్గాల్లో కాకుండా బీజేపీకి పట్టున్న నియోజకవర్గాల్లో ఇక వేరే వారని గెలవనియ్యకుండా ఈ ట్యాంపరింగ్ చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈవీఎంలను ట్యాపరింగ్ చేయవచ్చని గతంలోనే నిపుణులు నిరూపించారు. ఆ పని చేసిన వ్యక్తి పై కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఈ కర్నాటక ఎన్నికలని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే అటు అమిత షా ఇటు మోడీ, కొన్ని చోట్ల కేంద్ర మంత్రులు రంగంలోకి దిగి మరీ ప్రచారాన్ని పరుగులేట్టిస్తున్నారు. కాంగ్రెస్ కు మెజార్టీ సీట్లు వస్తాయని అన్ని సర్వేలు చెబుతున్నా… అది నిజం కాదని కర్నాటకలో తాము కచ్చితంగా గెలిచి తీరుతామని బీజేపీ చెబుతోంది. యడ్యూరప్ప ఏకంగా ఈ నెల 17-18 లలో తాను ప్రమాణస్వీకారం చేస్తానని ప్రకటించడం చుస్తింటే బీజీపీ కర్ణాటకలో కూడా ఏమైనా ప్లాన్ చేసిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. నిజంగా ఈవీఎం లు ట్యాంపరింగ్ చేయచ్చని నిరూపించినా, నిరూపించిన వ్యక్తిమీద కేసులు వేసిన బీజేపీ, కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదని విశ్లేషకులు అంటున్నారు.