ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. ఆ రాష్ట్రంలో పరిస్థితులపై తాజాగా మోదీ మాట్లాడారు. బెంగాల్లో రక్తపాత రాజకీయాలు జరుగుతున్నాయని మోదీ.. ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తృణమూల్ కాంగ్రెస్ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేందుకు అనేక విధాలుగా ప్రయత్నించిందని ఆరోపించారు.
బీజేపీ క్షత్రియ పంచాయతీ రాజ్ పరిషద్ కార్యకర్తలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలపై ఆయన విమర్శలు గుప్పించారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నెగ్గిన ప్రతిపక్షాలు.. వ్యతిరేకత దేశ ప్రభుత్వంపై సృష్టించాలనుకున్న విపక్షాలకు గట్టి సమాధానం ఇచ్చామని తెలిపారు.ఇండియా కూటమి ఎంపీలు ఓటు వేసేందుకు భయపడి పార్లమెంటు నుంచి మధ్యలోనే నిష్క్రమించారని మోదీ ఎద్దేవా చేశారు.
ఇక ప్రధాని మోదీ మణిపూర్ అంశంపై ప్రకటన చేయాలంటూ పార్లమెంట్ సమావేశాల్లో విపక్ష కూటమి ఇండియా పట్టుబట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టాయి. ఇందులో మోదీ సర్కార్ నెగ్గిన విషయం తెలిసిందే.