తనూశ్రీ దత్తా బాలీవుడ్ స్టార్ నటుడు నానా పటేకర్‌పై చేసిన లైంగిక ఆరోపణలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ వివాదం చిలికి చిలికి గాలి వానలా తయారు అయ్యింది. ఇప్పటికే జాతీయ స్థాయి మీడియా నుండి గల్లీ మీడియా వరకు ఈ విషయమై ప్రచారం చేస్తున్నాయి. దాంతో అంతా కూడా మీటూ ఉద్యమంలో పాల్గొంటున్నారు. తమకు జరిగిన చేదు అనుభవాలను బయటకు తీసుకు వచ్చేందుకు పలువురు లేడీస్ ముందుకు వస్తున్నారు. బాలీవుడ్లో ఇంత రచ్చ జరుగుతుంటే అమితాబచ్చన్ స్పందించకపోవడంతో విమర్శలు వ్యక్తం అయ్యాయి. దాంతో ఆయన తాజాగా స్పందించాడు.
అమితాబచ్చన్ సోషల్ మీడియాలో మీటూ పై స్పందిస్తూ.. ఆడవారు వర్క్ చేసుకునే ఏరియాలో భద్రత కల్పించాల్సిన భాద్యత ప్రభుత్వానికి ఉందని, ఆడవారు ఇబ్బంది పడితే మొత్తంకే నాశనం అంటూ అమితాబ్ పేర్కొన్నాడు. అమితాబ్ ట్వీట్‌ను ప్రముఖ బాలీవుడ్ హెయిర్ స్టైలిష్ సప్నామోతీ భవ్నానీ రీ ట్వీట్ చేసి మీరు అబద్దం చెబుతున్నారు సర్. త్వరలో మీగురించి రాబోతున్న నిజాలతో మీరు షాక్ అవుతారు. మీరు ముందు ముందు టెన్షన్‌తో గోర్లు కొరుక్కోవడానికి మీ గోళ్లు సరిపోవు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంటే సప్నా త్వరలో అమితాబ్ గురించి ఏదో పెద్ద బాంబ్ వేయబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. అదే కనుక నిజం అయితే అదో సంచలనం అవ్వడంఖాయం.