Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
శ్రీదేవి మరణం వెనుక మిస్టరీని ఛేదించేందుకు దుబాయి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సుదీర్ఘ పోస్ట్ మార్టంను నిర్వహించిన వారు ఆమె గుండెపోటుతో కాకుండా ఊపిరి ఆడక మృతి చెందినట్లుగా గుర్తించారు. గుండెపోటు అయ్యి ఉంటే ఎలాంటి విచారణ లేకుండానే మృతదేహంను పోలీసు వారు కుటుంబ సభ్యులకు అప్పటించే వారు. కాని అసహజ మరణం అవ్వడంతో అక్కడ పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. శ్రీదేవి భార్య బోణీ కపూర్‌ను టార్గెట్‌గా చేసి వారు విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా శ్రీదేవి హాజరైన కార్యక్రమాలు మరియు ఇతరత్ర విషయాలను కూడా దుబాయి పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు.
బోణీకపూర్పై అక్కడ పోలీసులు ఫోకస్ చేసి విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బోణీకపూర్ అక్కడ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆయనను అరెస్ట్ చేశారు అంటూ కూడా పుకార్లు షికార్లు చేశాయి. మొత్తానికి బోణీకపూర్ వ్యవహార శైలిపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, ఆయన హత్య చేసి ఉంటాడనే అనుమానాలను ఎక్కువ శాతంగా వారు నమ్ముతున్నారు అంటూ కొన్ని మీడియా సంస్థలు చెబుతున్నాయి. బోణీకపూర్ మాత్రం ఇప్పటి వరకు శ్రీదేవి మరణ విషయంపై మీడియాతో స్పందించిన దాఖలాలు లేవు. శ్రీదేవి అంటే అమితమైన అభిమానంను కనబర్చే బోణీకపూర్ ఆమె హత్యకు కారణం అయ్యి ఉంటాడు అంటూ వస్తున్న అనుమానాలను సినీ వర్గాల వారు కొట్టి పారేస్తున్నారు. ఆమెది ఆకస్మిక మరణం తప్ప హత్య కాదు అని ఎక్కువ శాతం అభిమానులు నమ్ముతున్నారు.