నేడు శాసనమండలిలో బొత్స సత్యనారాయణ vs అచ్చెన్నాయుడు

AP శాసనమండలి
AP శాసనమండలి

శాసనమండలిలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వర్సెస్ మాజీ మంత్రి, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను నాశనం చేశారని అచ్చెన్నాయుడు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు తీసుకువచ్చామని అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చ పెట్టాలని బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే, మంత్రి అయ్యావ్… ఇంకా ఏం లేదు అవ్వడానికి అని అచ్చెన్నాయుడును ఉద్దేశించి బొత్స సత్యనారాయణ విమర్శించారు