Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Boyapati srinu Going To Direct Naga Chaithanya Movie
అల్లు అర్జున్‌తో ‘సరైనోడు’ చిత్రాన్ని చేసి భారీ మాస్ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను దర్శకుడు బోయపాటి శ్రీను దక్కించుకున్నాడు. ఆ సినిమా పూర్తి అయిన వెంటనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో చిత్రాన్ని మొదలు పెట్టాడు. దాదాపు 50 కోట్ల బడ్జెట్‌తో బోయపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ‘జయ జానకి నాయక’ అనే టైటిల్‌ను తన చిత్రానికి బోయపాటి ఫిక్స్ చేయడం జరిగింది. భారీ అంచనాల నడుమ బెల్లంకొండ శ్రీనివాస్‌తో సినిమాను తెరకెక్కిస్తున్న బోయపాటి శ్రీను తర్వాత సినిమా అక్కినేని హీరోతో ఉండబోతుందనే ప్రచారం గత మూడు నాలుగు రోజులుగా భారీగా జరుగుతుంది.
నాగచైతన్యకు ఒక భారీ మాస్ హిట్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో నాగార్జున ఏకంగా 12 కోట్ల పారితోషికం ఇచ్చి బోయపాటి శ్రీనును బుక్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ‘జయ జానకి నాయక’ చిత్రం పూర్తి అయిన తర్వాత అక్కినేని మూవీ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. అయితే మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని దర్శకుడు బోయపాటి తేల్చేశాడు. తన తర్వాత సినిమా చిరంజీవి 152వ చిత్రం అని, ఇప్పటికే అందుకు కమిట్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు. అక్కినేని వారి నుండి తనకు ఎలాంటి ఆఫర్లు రాలేదు అంటూ బోయపాటి తాజాగా ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చి మీడియాలో వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాడు. చిరంజీవి ఆగస్టు నుండి 151వ సినిమా చేయనున్నాడు. కనీసం ఆరు నెలలు అయిన చిరు 151వ సినిమా పడుతుంది. అంటే బోయపాటి తర్వాత సినిమా కోసం దాదాపు ఆరు నెలలు వేచి ఉండాల్సి రావచ్చు.
మరిన్ని వార్తాలు: