హైదరాబాద్: భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు గాయమైన నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కేసీఆర్ ఆరోగ్యంపై సమాచారాన్ని తనకు తెలియజేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీకి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి రిజ్వీ వెళ్లారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో ఆయన మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి వద్దకు రిజ్వీ వెళ్లి పరిస్థితిని వివరించారు.