బ్రేకింగ్‌ న్యూస్‌ : సినిమాలకు గుడ్‌ బై చెప్పిన మంచు హీరో

breaking-news-goodbye-for-t

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మంచు మోహన్‌బాబు నట వారసుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మంచు మనోజ్‌ సంచలన ప్రకటన చేశాడు. తాను సినిమాల నుండి తప్పుకోబోతున్నట్లుగా ఫేస్‌బుక్‌లో పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను ‘ఒక్కడు మిగిలాడు’ చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ చిత్రం విడుదల తర్వాత కమిట్‌ అయిన సినిమాలను పూర్తి చేసి ఇక సినిమాలకు గుడ్‌ బై చెప్పబోతున్నట్లుగా మంచు మనోజ్‌ ప్రకటించాడు. మంచు మనోజ్‌ ప్రకటనతో అంతా కూడా షాక్‌ అవుతున్నారు. ఇటీవలే రైతుల కోసం ఏమైనా చేయాలని భావిస్తున్నట్లుగా ప్రకటించిన మనోజ్‌ ఉన్నట్లుండి ఇలా ప్రకటించడంతో అంతా కూడా అవాక్కవుతున్నారు.

కెరీర్‌ ఆరంభం నుండి ఇప్పటి వరకు మనోజ్‌ కమర్షియల్‌గా బిగ్గెస్ట్‌ సక్సెస్‌ను అందుకోలేక పోయాడు. ఆ కారణంగా మనోజ్‌ సినిమాలకు దూరం అవ్వాలనుకుంటున్నాడా లేక మరేదైనా ఉద్దేశ్యంతో మనోజ్‌ సినిమాల నుండి తప్పుకున్నాడా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. టాలీవుడ్‌ మొత్తం ప్రస్తుతం ఇదే టాపిక్‌ ట్రెండ్‌ అవుతుంది. మంచు మనోజ్‌ సామాజిక అంశాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటాడు. అందుకే ఆయన రాజకీయాల్లోకి కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయనే టాక్‌ వినిపిస్తుంది. మొత్తానికి మంచు మనోజ్‌ చేసిన ప్రకటన ఇప్పుడు సర్వత్రా చర్చకు తెర లేపింది. మంచు మనోజ్‌ను ఈ విషయమై ఆయన సన్నిహితులు సంప్రదించే ప్రయత్నం చేస్తుండగా అందుబాటులో లేడని తెలుస్తోంది.

manchu manoj announces to quit acting