మరో పరువు హత్య…వెంటాడి చెల్లి, బావని నరికాడు…!

Brother Killed Her Sister For Intercast Marriage

కని పెంచిన తల్లిదండ్రులను కాదని తక్కువ కులం వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకున్న చెల్లిపై ఓ అన్న పగబట్టాడు. తోడబుట్టిన చెల్లి అని కూడా ఆలోచించకుండా ఆమెని ముందు కిరాకతంగా నరికి చంపిన ఆ దుండగుడు ఆ తరువాత ఆమె పెళ్లి చేసుకున్న వ్యక్తిని కూడా వెంటపడి మరీ నరికాడు. ఆ తర్వాత ఘటనాస్థలం నుంచి మాయమయ్యాడు. గుజరాత్ లోని సాణంద్ పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం సాణంద్ లోని బస్టాండ్ సమీపంలో ఓ యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటోంది.

brother-murder-hre-sister

ఇదే ప్రాంతంలోని దళితవాడలో ఉంటున్న విశాల్ పర్మర్ ని యువతి ప్రేమించింది. కులాలు వేరెవరు కావడంతో కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపినా యువతి విశాల్ ను ఐదు నెలల క్రితం వివాహం చేసుకుంది. దీంతో ఈ విషయం తీవ్ర అవమానంగా భావించిన ఆమె అన్న తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయాడు. సమయం కోసం అదనుచూసిన అతను నిన్న చెల్లి ఇంటికి వెళ్లి ఆమెపై కత్తితో దాడిచేశాడు. దీంతో విశాల్ బయటకు పరిగెత్తాడు. అతని వెంటపడ్డ హంతకుడు మరో ఇంట్లోకి వెళ్లి దాక్కున్న విశాల్ ను బయటకు లాక్కుని వచ్చి మరీ కత్తితో నరికాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

brother-killed-her-sister-k