తెలంగాణలో అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ మధ్యలో కాంగ్రెస్ ఇలా ప్రధాన పార్టీలు ప్రత్యర్థి పార్టీల నేతలపై వరుస ఫిర్యాదులు చేస్తుండటంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. తాజాగా బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు.. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో రెండు పార్టీల మధ్య వివాదం తీవ్రమైంది.