యూపీ బస్సు ప్రమాదం : ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

bus accident in up

ఉత్తరప్రదేశ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగి రోడ్డు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న యూపీఎస్‌ఆర్టీసీ బస్సు ఇవాళ ఉదయం యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై రెండు ఫ్లై ఓవర్ల మధ్య ఉన్న గ్యాప్‌లో 40 ఫీట్ల లోతులో పడిపోయింది. ఈ ప్రమాదంలో 29 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మిగతా వారు గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం బస్సు ప్రమాద బాధితులకు అన్ని విధాలా అండగా ఉండాలని మోదీ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది యూపీ ప్రభుత్వం. డ్రైవర్‌ నిద్ర పోవడం వల్లే అదుపుతప్పి బస్సు బోల్తా పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.