త‌మిళ సంక్రాంతి జ‌రుపుకున్న కెన‌డా ప్ర‌ధాని

Canadian PM Justin Trudeau Wears Veshti Celebrate Pongal Toronto

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పండుగ అంటే సంప్ర‌దాయాల మేళ‌వింపు. మ‌హిళ‌ల‌యినా, పురుష‌ల‌యినా పండుగ రోజు సంప్ర‌దాయ దుస్తులు ధ‌రించాలి. పండుగ‌కు సంబంధించిన అన్ని ఆచారాలు విధిగా పాటించాలి. కానీ మ‌న‌లో ఎక్కువమంది ఇవి పాటించ‌డం లేదు. పండుగ స‌మయాల్లో కూడా పాశ్చాత్య త‌ర‌హా దుస్తులే ధ‌రిస్తున్నారు. మొక్కుబ‌డిగా పూజ‌లు చేస్తున్నారు. దేశంలోని ఏ రాష్ట్ర ప్ర‌జ‌లూ ఇందుకు మిన‌హాయింపు కాదు.

సంస్కృతీ, సంప్ర‌దాయాలు ఎక్కువ‌గా పాటిస్తార‌ని భావించే త‌మిళులు సైతం ప‌ర్వ‌దినాల రోజు ఆధునిక వ‌స్త్ర‌ధార‌ణ‌తో క‌నిపిస్తుంటారు. అయితే వారి పండుగ‌ను జ‌రుపుకుంటున్న కెన‌డా ప్ర‌ధాని మాత్రం అచ్చ‌మైన త‌మిళ్ య‌న్ గా ముస్తాబై అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. త‌మిళుల సంక్రాంతి తై పొంగ‌ల్ ను త‌మిళ సంప్ర‌దాయాన్ని ప్ర‌తిబింబించేలా ఆయ‌న జ‌రుపుకోవ‌డం నెట్టింట్లో వైర‌ల్ గా మారింది. కెన‌డాలో స్థిర‌ప‌డిన త‌మిళుల‌తో క‌లిసి ప్ర‌ధాన‌మంత్రి జ‌స్టిన్ ట్రూడెవూ సంక్రాంతి వేడుక‌లు జ‌రుపుకున్నారు. అంతేకాదు..టొరంటో మేయ‌ర్ జాన్ టోరీతో క‌లిసి పొంగ‌ల్ ను వండారు కూడా. ఈ కార్య‌క్రామ‌నికి సంబంధించిన ఫొటోల‌ను త‌న ట్విట్ట‌ర్ ఎకౌంట్ లో పోస్ట్ చేశారు కెన‌డా ప్ర‌ధాని. పండుగ శుభాకాంక్ష‌లు కూడా త‌మిళంలో చెప్పారు.

త‌మిళ కెన‌డియ‌న్ల‌తో క‌లిసి పొంగ‌ల్ పండుగ‌ను జ‌రుపుకోవ‌డం త‌న‌కు ఎంతో సంతోషాన్నిచ్చింద‌ని తెలిపారు. ఈ నెల‌ను త‌మిళ్ హెరిటేజ్ నెలగా జ‌రుపుకోనున్న‌ట్టు వెల్ల‌డించాడు. కెన‌డా అభివృద్ధిలో త‌మిళులు ప్ర‌త్యేక పాత్ర పోషిస్తున్నార‌ని కెన‌డా ప్ర‌ధాని కొనియాడారు.