వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేతపై కేసు నమోదు

YS Jagan
YS Jagan

వైసీపీ నేతలు మరోసారి రెచ్చిపోయారు. జగన్ ప్రభుత్వంలో అరాచకాలకు పాల్పడిన నేతలు కూటమి ప్రభుత్వంలోనూ యథేఛ్చగా దాడులకు పాల్పడుతున్నారు. జగన్ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నేతలు, సానుభూతిపరులపై దాడులే లక్ష్యంగా వైసీపీ రౌడీ మూక దాడులు చేసింది. తాజాగా ఏలూరు జిల్లాలో వైసీపీ శ్రేణులు బీభత్సం సృష్టించాయి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై దాడి కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై కేసు నమోదైంది. చింతమనేని డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏలూరు 3 టౌన్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు.