Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బాలీవుడ్లో తెరకెక్కిన ‘పద్మావతి’ చిత్రం పలు వివాదాల కారణంగా విడుదల సమస్యలు ఏర్పడ్డ విషయం తెల్సిందే. రాజ్పూత్లతో పాటు చరిత్రకారులు సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరియు సెన్సార్ బోర్డు ఈ చిత్రం విడుదలకు అనుమతించలేదు. ఎట్టకేలకు సినిమాకు సెన్సార్ బోర్డు క్లీయరెన్స్ వచ్చింది. కాని పద్మావతి చిత్రానికి ఏకంగా 300 కట్స్ చెప్పిన తర్వాత సెన్సార్ బోర్డు క్లీయరెన్స్ ఇచ్చింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అన్ని కట్స్ తర్వాత సినిమాలో ఏం మిగిలి ఉంటుందని, నెటిజన్లు సెన్సార్ బోర్డుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సెన్సార్ బోర్డు చైర్మన్ ‘పద్మావతి’ సెన్సార్ కట్స్‌పై క్లారిటీ ఇచ్చాడు.
సీబీఎఫ్సీ చైర్మన్ ప్రసూన్ జోషీ మాట్లాడుతూ… ‘పద్మావతి’కి 300 కట్స్ చెప్పినట్లుగా మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని, సెన్సార్ బోర్డు పరువు తీసే విధంగా మాట్లాడవద్దంటూ మీడియాకు ప్రసూన్ హితవు పలికాడు. రాజ్‌పూత్‌లు మరియు చరిత్రకారుల సలహాలు సూచనల మేరకు తాము కేవలం 5 చిన్న చిన్న కట్ చెప్పామని, చిత్ర యూనిట్ సభ్యులు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా వాటిని తొలగించారు అంటూ చెప్పుకొచ్చాడు. దీపిక పడుకునే టైటిల్ రోల్లో నటించన ఈ చిత్రాన్ని ఇంకా కూడా అడ్డుకుంటామంటూ కొందరు ఆందోళన చేస్తున్నారు. సంజయ్ లీలా భన్సాలీ మాత్రం చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈనెల 25న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. వివాదాల కారణంగా భారీ పబ్లిసిటీ వచ్చింది. కనుక భారీ ఓపెనింగ్స్ ఖాయం అంటూ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.