Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గాలి జనార్దన్ రెడ్డి, వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసును టేకప్ చేసి ఒక్క సారిగా దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారని పవన్ జనసేనలో ఆయన జాయిన్ అవుతారని అందరు భావిస్తున్న తరుణంలో ఆయన మాత్రం పదవికి గుడ్ బై చెప్పిన అనంతరం శ్రీమంతుడు అయిపోయారు. అంటే బాగా డబ్బున్న మనిషి కాదండోయ్, ఆయన మహేష్ శ్రీమంతుడుగా మారిపోయారు. అవును రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇంకా సమయం ఉందని ప్రకటించిన మాజీ జేడీ ఈ క్రమంలో పలు కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇప్పటికే తన స్వగ్రామంలో రైతులతో భేటీ అయి సమస్యలు తెలుస్కున్న ఆయన రైతు సమస్యల అధ్యయనంకోసం ఉత్తరాంధ్రలో పర్యటించి అక్కడి రైతుల పరిస్థితులు, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
తన పర్యటనలో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు లక్ష్మీనారాయణ శ్రీకాకుళం జిల్లాలోని కవిటి మండలం సహలాలపుట్టుగలో స్వచ్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా గ్రామంలో కలియ తిరిగారు. పరిశీలించిన అనంతరం గ్రామాన్ని బాగుచేయాలని భావించి దత్తత తీసుకుంటానన్నారు. నెల రోజులలో ప్రణాళికను తయారు చేసి గ్రామాభివృద్ధికి సిద్ధమవుతానని హామీ ఇచ్చారు. ‘రైతేరాజు-గ్రామ స్వరాజ్యమే ధ్యేయం’ పేరిట జిల్లాలో శ్రీకాకులం జిల్లాలో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా కవిటి మండలంలోని సహలాలపుట్టుగ గ్రామాన్ని ఆయన శుక్రవారం రాత్రి సందర్శించారు. జిల్లాలో ఆయన అయిదు మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కవిటి మండలంలోని సహలాలపుట్టుగ గ్రామానికి రాత్రి బస కోసం చేరుకున్న ఆయన గ్రామస్థుల సమస్యలను విన్నారు. ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని – రాష్ట్రంలోనే ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. దేశంలో రాజకీయ వ్యవస్థలో సమూల మార్పులు తేవాలన్న అయన ఆ ఆదిశగా అడుగులు వేయాలని ప్రజలకు సూచించారు.అందరూ కలిసి వ్యవసాయానికి పూర్వ వైభవం తీసుకురావాలని ఆయన కోరారు. అలాగే గ్రామంలో యువత ఎవరూ మద్యం తాగవద్దని ఆయన సూచించారు.