Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దుబాయ్ లో వివాదాస్పద పరిస్థితుల్లో కన్నుమూసిన శ్రీదేవి భౌతిక కాయం మంగళవారం రాత్రి 9గంటల తర్వాత ముంబై ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అనంతరం అక్కడి నుంచి ఆమె మృతదేహాన్ని కుటుంబసభ్యులు అంబులెన్స్ లో లోఖండ్ వాలా ప్రాంతంలోని గ్రీన్ ఏకర్స్ లో ఉన్న శ్రీదేవి స్వగృహానికి తరలించారు. ఈ ఉదయం శ్రీదేవి పార్థివ శరీరాన్ని ప్రజలు, ప్రముఖులు సందర్శనార్థం సెలబ్రేషన్స్ క్లబ్ లో ఉంచారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీదేవి భౌతికకాయాన్ని సెలబ్రేషన్స్ క్లబ్ లో ఉంచుతారు. రెండు గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4.30 మధ్య పవన్ హాన్స్ శ్మశానవాటికలో శ్రీదేవి అంత్యక్రియలు జరగనున్నాయి.
ఇక శ్రీదేవి అంతిమ యాత్రలో పాల్గొనేందుకు, ఆమెను కడసారి చూసేందుకు లక్షల్లో అభిమానులు ముంబయి చేరుకుంటున్నారు. ఇక వందల సంఖ్యలో సినీ ప్రముఖులు కూడా ఆమె ఇంటికి వెళ్తున్నారు. సౌత్ నుండి ఇప్పటికే స్టార్ హీరోలు పలువురు ముంబయి చేరుకున్నారు. ఆమె అంతిమ యాత్రలో పాల్గొనేందుకు పలువురు తెలుగు, తమిళ మరియు బాలీవుడ్ సినీ ప్రముఖులు సిద్దం అవుతున్నారు. శ్రీదేవితో వర్క్ చేసిన స్టార్స్ మరియు ఆమెతో అనుబంధం ఉన్న పలువురు దర్శక నిర్మాతలు కూడా ఆమె అంతిమ యాత్రలో పాల్గొనేందుకు ముంబయి తరలి వెళ్తారు. మొత్తానికి శ్రీదేవి అంతిమ యాత్రలో దేశ వ్యాప్తంగా అన్ని భాషల సినీ ప్రముఖులు హాజరు అవుతున్నారు.