Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దగ్గుబాటి రానా… వరుసగా వెరైటీ సినిమాలు తీస్తూ టాలీవుడ్ లో ప్రత్యేకమైన స్థానం దక్కించుకున్నాడు. దగ్గుబాటి వారసుడుగా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ‘లీడర్’ మూవీ తో అడుగుపెట్టిన రానా… బాహుబలి మూవీ తో భల్లాల దేవుడిగా దేశమంతా పాపులారిటీ దక్కించుకున్నాడు. ఈరోజు దగ్గుబాటి రానా 33వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. దగ్గుబాటి రానా బర్త్ డే సందర్భంగా పలువురు సినీ ప్రముఖుల రానాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్… రానా భుజాల మీద ఉన్న ఫోటోను పోస్ట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బన్నీతోపాటు మరికొంత మంది కూడా రానాకు బర్త్డే విషెస్ చెప్పారు.