Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఓ పక్క రాష్ట్రంలో బంద్, మరో పక్క పార్లమెంట్ లో ఎంపీల ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పోలవరానికి నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టుకు ప్రస్తుతానికి రూ.417.44కోట్లు విడుదల చేస్తున్నట్టు పేర్కొంది. అంతకుముందు తనను కలిసి ఏపీ బీజేపీ ఎంపీల వద్ద కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పోలవరం గురించి ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అయిన పోలవరాన్ని 2019లోగా పూర్తిచేయడం తన బాధ్యతన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీకి నిధులు, జాతీయ రహదారులు ఇచ్చామని తెలిపారు. రాజకీయం కోసమే టీడీపీ ఆందోళనలు చేస్తోందని బీజేపీఎంపీలతో గడ్కరీ వ్యాఖ్యానించారు.