మెడికల్ లో చైతన్య చేవ తగ్గిందా ?

chaithanya reduced in medical service

తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ మెడికల్ అనగానే ముందుగా చైతన్య గుర్తుకు రావడం సహజం. అయితే ఆ ఒరవడికి బ్రేక్ పడిందా ? మెడికల్ విభాగంలో చైతన్య చేవ తగ్గిందా ? తాజాగా వచ్చిన ఏపీ ఎంసెట్ , నీట్ ఫలితాలు చూస్తే ఆ డౌట్ రాక మానదు. మొన్న వచ్చిన ఏపీ ఎంసెట్ ,మెడికల్ విభాగం ఫలితాల్లో  ఈసారి చైతన్య మంచి ఫలితాలను సాధించలేకపోయింది , అదే సమయంలో పోటీ సంస్థలు మాత్రం మెరుగయిన ఫలితాలు సాధించాయి. ఫస్ట్ ర్యాంక్ మాత్రమే కాదు టాప్ టెన్ లో కూడా చైతన్య కి పోటీ సంస్థలు ఉత్తమ ఫలితాలు సాధించాయి. ఇదేదో కాకతాళీయం అనుకోడానికి వీల్లేకుండా నిన్న వచ్చిన నీట్ ఫలితాల్లోనూ ఇదే ధోరణి కనిపించింది. సౌత్ ఇండియా కి వచ్చిన బెస్ట్ ర్యాంక్ 7 . ఇక 50 లోపు ర్యాంక్స్ లో తెలుగు విద్యార్థులు నాలుగు ర్యాంకులు తెచ్చుకున్నారు. వీటిలో చైతన్య కి దక్కింది ఒక్క ర్యాంక్ మాత్రమే. అది కూడా 40 వ ర్యాంక్. చైతన్య పోటీ సంస్థల విద్యార్థులు అంతకన్నా మంచి ర్యాంక్స్ సాధించారు. 7 , 16 ర్యాంకులు ఇతర విద్యా సంస్థలకి చెందిన విద్యార్ధులకి వచ్చాయి. మెడికల్ విభాగంలో చైతన్య జోరు తగ్గడానికి ఇటు తల్లిదండ్రులు అటు విద్యారంగ నిపుణుల నుంచి కొన్ని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. బ్రాంచ్ లు పెరిగినంత స్థాయిలో బోధన చేసే లెక్చరర్స్ పెరగకపోవడం ఒక కారణం అని పేరెంట్స్ నుంచి వినిపిస్తున్న మాట. ఇక నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో పోటీ పడలేకపోవడానికి శిక్షణా విధానాలు సరికొత్త పోటీకి తగ్గట్టు లేకపోవడం అని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. పరీక్షల్లో వస్తున్న మార్పులకి తగినట్టు బోధన రంగంతో పాటు వివిధ అంశాల్లో పాత విధానాలు అవలంభించడం కూడా ఇందుకు ఒక కారణం. వస్తున్న మార్పులకి తగ్గట్టు విద్యార్థుల్ని , ఉపాధ్యాయుల్ని రెడీ చేయలేకపోవడంతో జాతీయ స్థాయి పోటీల్లో మరీ పేలవమైన ఫలితాలు వస్తున్నాయి. ఈ విషయంలో చైతన్య యాజమాన్యం మేలుకుంటే మున్ముందు అయినా ఆ సంస్థ మెడికల్ విభాగంలో రాణిస్తుంది. లేదంటే ఘనమైన గతాన్ని మాత్రమే చెప్పుకోవాల్సి ఉంటుంది.