Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హోదా ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసే వ్యూహంలో భాగంగా ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు ఒక సంచలన అంశాన్ని బయట పెట్టారు. హోదా విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ తీరు మారకపోతే దక్షిణ భారతదేశంలోని తెలుగు ప్రజలందరినీ కూడగడతామని, ఉత్తర భారత దేశానికి వెళ్లే రహదారులను మూసివేస్తామని చలసాని శ్రీనివాస్ హెచ్చరించారు. తల్లిదండ్రులను చంపేసి, సమాజమే తమకు అన్యాయం చేసిందన్నట్టుగా మోదీ వ్యవహారం ఉందని శ్రీనివాస్ విమర్శించారు. అయితే వినగానే రోమాలు నిక్కబొడుచుకునే ఈ వ్యూహం ఆచరణ సాధ్యం కాదేమో అన్న అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.
ప్రత్యేక హోదా ఉద్యమ ప్రభావం దేశం మొత్తం మీద పడేలా చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి ఇది మంచి వ్యూహమే అయినప్పటికీ ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నదే అనుమానం. ఎందుకంటే ఏపీకి ఉత్తరాదితో సరిహద్దులు లేవు కేవలం దక్షిణాదికి చెందిన పొరుగురాష్ట్రాలు తెలంగాణా-ఒరిస్సా రాష్ట్రాలతో సరిహద్దు మాత్రమే. ఈ క్రమంలో చలసాని బయట పెట్టిన వ్యూహం అమలుకావాలంటే ఉత్తరాది ముఖద్వారమైన మహారాష్ర్టతో సరిహద్దు ఉన్న తెలంగాణ – కర్ణాటక రాష్ట్రాల పూర్తి సహకారం లేనిదే అసలు పనవ్వదు. అయితే కర్ణాటకలో త్వరలో ఎన్నికలు ఉన్నాయి. ఒకవేళ రహదారులు మూసి వేస్తే ఎన్నికల సంఘం ఆదేశాల దృష్ట్యా కేంద్ర బలగాలు దిగే అవకాశం ఉంది.
అలాగే తెలంగాణా ప్రస్తుతానికి కేసీఆర్ మోడీ కి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ రహదారుల దిగ్బంధం అంటే మద్దతు ఇస్తారో ఇవ్వరో తెలియని పరిస్థితి. ఇక మరో పక్కన ఉంది ఒడిశా అంటే ఒకవేళ ఒడిసా మనకి సహకరిస్తే ఒడిశా సరిహద్దుల్లోని రోడ్లను దిగ్బంధించడం వల్ల తూర్పున ఉన్న పశ్చిమ బెంగాల్ తో పాటు ఈశాన్య రాష్ట్రాలకు ఇబ్బంది ఎదురవుతుంది. ఈ పరిణామంతో కేంద్రం కాస్త దిగివచ్చే పరిస్థితి. కాని అంతా బాగానే ఉన్నా ఇలా రహదారుల దిగ్బంధం చేస్తే రాజద్రోహం కింద కేంద్రం ఏమయినా చేయడానికి వెనకాడకపోవచ్చు. సో దీనికంటే వేరే ప్రత్యామ్నయం చూడడం మంచిది. ఏది ఏమయినా ఇలా ప్రత్యేక హోదా కోసం ఇలా ప్రజా సంఘాల నాయకులు రంగంలోకి దిగడం స్వాగతించ వలసిన విషయం.